Iron Pillar: ఒక్క క్షణం ముందు జరిగితే.. ఏం జరిగి ఉండేదో..? సీసీ కెమెరా విజువల్స్ వైరల్..

కర్ణాటకలోని హుబ్బళ్లిలో వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డుపై సడెన్ గా ఓ ఐరన్ పిల్లర్ పడిపోయింది. కొద్ది క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బైక్ లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి.

Iron Pillar: ఒక్క క్షణం ముందు జరిగితే.. ఏం జరిగి ఉండేదో..? సీసీ కెమెరా విజువల్స్ వైరల్..

|

Updated on: Jul 01, 2023 | 4:33 PM

కర్ణాటకలోని హుబ్బళ్లిలో వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డుపై సడెన్ గా ఓ ఐరన్ పిల్లర్ పడిపోయింది. కొద్ది క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బైక్ లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండడం గమనించి బైకర్లతో పాటు వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అడుగుదూరంలో కళ్లముందే పెద్ద ఐరన్ పిల్లర్ కూలడంతో ఆ బైకర్లు షాక్ కు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం, ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాలకు ఎత్తుకు సంబంధించిన హెచ్చరిస్తూ ఏర్పాటు చేసిన పిల్లర్ ఇది. ఇటీవల పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల సందర్భంగా ఏర్పడే వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారి సడెన్ గా కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Follow us
హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..

మటన్ కూర్మా ఇలా చేశారంటే.. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది..

ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ఎప్పటినుంచంటే?

ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. 2 లక్షల కోట్లతో..

రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్. ఫుల్ ఫోకస్ దానిమీదే

గురి చూసి కొట్టారు..క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్

ఈ చర్మ సమస్యలను విస్మరించవద్దు ... అది మధుమేహం లక్షణం ఏమో

మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!

కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..

శాంతిభద్రతలను సెట్‌రైట్‌ చేస్తాం.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!

కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!