Watch Video: వివాహ వేడుకలో గన్నుతో మహిళ రచ్చ రచ్చ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Woman does celebratory firing: పెళ్లి వేడుకల్లో ఎవరైనా ఏం చేస్తారు? పాటలు పాడుకుంటూ, డ్యాన్స్‌ చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ఓ వికృత క్రీడకు తెరలేపారు. అసలు ఆ విష సంస్కృతి

Watch Video: వివాహ వేడుకలో గన్నుతో మహిళ రచ్చ రచ్చ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 17, 2022 | 6:47 AM

Woman does celebratory firing: పెళ్లి వేడుకల్లో ఎవరైనా ఏం చేస్తారు? పాటలు పాడుకుంటూ, డ్యాన్స్‌ చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ఓ వికృత క్రీడకు తెరలేపారు. అసలు ఆ విష సంస్కృతి ఎందుకొచ్చింది..? ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర భారతదేశంలో ఇన్నాళ్లు ఏదైనా వేడుకల్లో పురుషులు గన్‌ఫైరింగ్‌ చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు మేమేం తక్కువ అని, వారి సరసన చేరుతున్నారు మహిళలు. సెలబ్రెటీ ఫైరింగ్‌లో మగవాళ్లతో పోటీ పడుతున్నారు ఆడవాళ్లు. తాజాగా మధ్యప్రదేశ్‌ (madhya pradesh) లోని గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో ఓ మహిళ గన్‌తో హిల్‌చల్‌ చేసింది. వివాహ వేడుకల్లో ఒక్కసారి కాదు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి హల్‌చల్‌ చేసింది. తొలుత సింగిల్‌గానే గాల్లోకి కాల్పులు జరిపిన లేడీ, ఆ తరువాత తన భర్తతో కలిసి సెలెబ్రెటీ ఫైరింగ్‌ చేసింది. ఇద్దరు కలిసి రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. నువ్వా-నేనా అన్నట్టు పోటీపడి గాల్లోకి కాల్పులు జరిపారు ఆ భార్యాభర్తలు. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియా (Social Media) లో వైరల్‌ అయ్యింది.

దీంతో ఈ ఇష్యూపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. ఒమన్ గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాల్పులు జరిపినట్టు గుర్తించారు పోలీసులు. తాము ఇటీవల వీడియోను చూశామని, ఆ వీడియో గురించి సమాచారాన్ని సేకరించడానికి పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు క్రైమ్ బ్రాంచ్ ఏఎస్పీ రాజేష్ దండోటియా. నిర్ధారణ తర్వాత ఆ మహిళ, పురుషుడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు దండోటియా. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇదే ప్రాంతంలో సెలెబ్రెటీ గన్‌ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి వీడియో చూడండి..

వీడియో..

ఓ పెళ్లి వేడుకలో యువకుడు తుపాకీతో బుల్లెట్లు పేల్చడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అదే తుపాకీతో పర్వతం పైనుంచి కాల్పులు జరిపాడు ఓ యువకుడు. దీనిపై సీరియస్‌ అయిన పోలీసులు, అతన్ని అరెస్టు చేసి, ఆ గన్‌ను సీజ్‌ చేశారు. సెలబ్రేటరీ కాల్పులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనల పట్ల పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాగా డబ్బున్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని అంటున్నారు స్థానికులు.

Also Read:

Viral Video: ఫొటోగ్రాఫర్‌పై పడగెత్తిన పాము..పరుగులంకించుకున్నా వదల్లేదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Watch Video: 13 బంతుల్లో అర్థ సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్.. యూవీ రికార్డుకు తప్పిన ప్రమాదం..