Viral Video: పాముతోనే పరాచకాలా.! ‘కప్ప’గంతులు వేసినా ప్లేట్ మీల్స్ అవ్వాల్సిందే.. వీడియో చూస్తే
కప్పను వెంటాడి.. వేటాడిన ఓ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కప్పలు సులభంగా పాములకు ఆహారంగా చిక్కవు. సరిగ్గా ఈ పాము కూడా అదే తరహాలో కష్టపడాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..! ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

జంతు ప్రపంచంలో ప్రతీది రిస్క్‌తో కూడుకున్న పనే. హాయిగా తన ఆకలి తాను చూసుకున్నానని అనుకునేలోపు.. ఓ జంతువు క్రూర మృగానికి ఎర కావాల్సిందే. ఇలాంటి దృశ్యాలు తరచూ అడవిలో కనిపిస్తాయి. ఇక అలాంటి వీడియోలపై నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తారు. ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ పాము అతికష్టం మీద తన ఎర కప్పను పట్టుకుంది.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
వైరల్ వీడియో ప్రకారం.. ఓ అటవీ ప్రాంతంలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తోన్న ఒక కప్పను.. దూరం నుంచి పాము చూసింది. ఇక దాన్ని తన ఎరగా మలుచుకునేందుకు వెంబడించింది. వచ్చే ప్రమాదాన్ని గ్రహించిన కప్ప తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పాము దగ్గరకు రావడాన్ని చూసి కప్ప దూకుతూ పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని చురుకుదనాన్ని చూసి పాము నోటికి దొరక్కుండా బయటపడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి పాము నోట కరిచిపెట్టుకుంటుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
— Damn Nature You Scary (@AmazingSights) October 2, 2025




