Viral Video: చూసేందుకే మెట్రో ట్రైన్.. పక్కా మ్యాజిక్ ట్రైన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్‌. అయితే, ఇంటికి సమీపంలో రైళ్లు, మెట్రో ట్రైన్ ఉండటం వల్ల ఆ ప్రైవసీకి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది.

Viral Video: చూసేందుకే మెట్రో ట్రైన్.. పక్కా మ్యాజిక్ ట్రైన్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Metro Trains
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 14, 2023 | 1:10 PM

ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్‌. అయితే, ఇంటికి సమీపంలో రైళ్లు, మెట్రో ట్రైన్ ఉండటం వల్ల ఆ ప్రైవసీకి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లో కామన్. కానీ, సింగపూర్‌లో మాత్రం ఇలాంటి సమస్య అస్సలే ఉండదు. కారణం.. అభివృద్ధి చెందిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే. తాజాగా సింగపూర్‌కు చెందిన మెట్రో రైల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది కదా జనాలకు కావాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చూసే మనకే ఇలా ఉంటే.. ఆ మెట్రోలే వారికి ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారు.

మన వద్ద ఉన్నట్లుగానే సింగపూర్‌లోనూ మెట్రోట్రైన్స్ ఉన్నాయి. అయితే, అవి మనకంటే అడ్వాన్స్‌డ్ ట్రైన్స్. ప్రజల ప్రైవసీకి ప్రొటక్షన్ ఇచ్చే ట్రైన్స్. మన వద్ద మెట్రోలో వెళ్తుంటే.. చుట్టూ ఉన్న బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్స్, గదులు ఇతరరత్రా అన్నీ కనిపిస్తాయి. కానీ, సింగపూర్‌లో మాత్రం అలా కనిపించదు. కారణం.. ప్రజల ప్రైవసీ. అవును, ప్రజల ప్రైవసీని కాపాడేందుకు మెట్రోలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు సింగపూర్ అధికారులు.

ఇవి కూడా చదవండి

సింగపూర్‌లో మెట్రో విండోస్ బహువిచిత్రంగా ఉన్నాయి. ఓపెన్ ప్లేసెస్ ఉన్నంత వరకు మెట్రో గ్లాస్‌ నుంచి బయటి వాతావరణం అంతా క్లియర్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో ఇళ్లు, హోటళ్లు రాగానే విండోస్ ఆటోమాటిక్‌గా బ్లాక్ అవుతున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వద్దకు వచ్చేసరికి విండో గ్లాస్‌లు మూసివేసినట్లుగా బ్లర్ అవుతున్నాయి.

సింగపూర్‌లో ఈ మెట్రో ట్రైన్‌ని బుకిట్ పంజాంగ్ లైట్ రైల్ ట్రాన్సిట్(LRT) అని పిలుస్తారు. ఈ రైళ్లకు స్మార్ట్ మిస్టింగ్ గ్లాసెస్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో ఈ వీడియో షేర్ చేయగా.. నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాండ్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 27 వేల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. ప్రైవసీకి ప్రియారిటీ ఇస్తున్న సింగపూర్ నిజంగా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సింగపూర్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారు. ఇది మెట్రో ట్రైన్ కాదని, మ్యాజిక్ ట్రైన్ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

వైరల్ అవుతున్న మెట్రో ట్రైన్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..