Watch Video: లిఫ్ట్‌లో బాలుడిని కరిచిన పెంపుడు శునకం.. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Viral Video: లిఫ్ట్‌లో వెళ్తుండగా ఓ బాలుడిని పెంపుడు శునకం కరిచింది. అంతా చూస్తున్నా ఏమీ పట్టనట్లు ఉండిపోయింది ఆ పెంపుడు శునకం యజమాని. ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viral News: లిఫ్ట్‌లో వెళ్తుండగా ఓ బాలుడిని పెంపుడు శునకం కరిచింది. అంతా చూస్తున్నా ఏమీ పట్టనట్లు ఉండిపోయింది ఆ పెంపుడు శునకం యజమాని. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో చోటు చేసుకుంది. బాలుడిని శునకం కరుస్తున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. సదరు వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఓ బాలుడు, మరో మహిళ, ఆమె పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తున్నారు. బాలుడు లిఫ్ట్ డోర్ వైపు వెళ్లగానే.. కుక్క అతని వైపుగా వెళ్లి కాలు కరిచింది. నొప్పితో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. ఇదంతా చూస్తున్నా.. ఏమీ జరగనట్లు ఆ మహిళ మౌనంగా ఉండిపోయింది. నొప్పితో బాధపడుతున్నా ఆ బాలుడిని కనీసం ఓదర్చలేదు. తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ దిగి వెళ్లిపోయింది.
See in the video Humanity shamed in #Ghaziabad, the dog bitten the child in the #lift, the woman kept looking at the innocent crying in pain#ViralVideo pic.twitter.com/Leys6rW6UY
— Himanshu dixit ??? (@HimanshuDixitt) September 6, 2022
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు పెంపుడు శునకం యజమానిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చార్మ్స్ క్యాజిల్ సొసైటీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి