Viral Video: రేషన్‌షాప్‌కు మెర్సిడిస్ బెంజ్ కారులో ఎవరైనా వస్తారా? ఉచిత రేషన్ కారులో తీసుకెళ్తారా..?
Viral Video: నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ బెంజ్ కారులో రేషన్ సరుకులను తీసుకెళ్లడం తీవ్ర..
Viral Video: నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. కానీ ఇక్కడ బెంజ్ కారులో రేషన్ సరుకులను తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని హోషియార్‌పూర్‌లో ఓ వ్యక్తి ఉచిత రేషన్‌ను తీసుకోవడానికి బెంజ్ కారులో వచ్చాడు. పంజాబ్ ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్‌ను బెంజ్ కారులో తీసుకెళ్లాడు . సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఉచితరేషన్ పథకం దుర్వినియోగం అవుతోందని దేశమంతటా విమర్శలు వస్తున్నాయి. అయితే బెంజ్ కారులో రేషన్‌షాప్‌కు వచ్చిన వ్యక్తి తరువాత వివరణ ఇచ్చాడు . ఆ వ్యక్తి పేరు సుమిత్ షైనీ. ఆ కారు తనది కాదని , విదేశాల్లో ఉన్న బంధువులదని వెల్లడించారు. రేషన్ దుకాణంలో క్యూలైన్‌లో ఉన్న తన పిల్లలు రేషన్‌ను తీసుకెళ్లడానికి రావాలని కోరడంతో ఆ కారును తీసుకొచ్చినట్టు తెలిపారు.
#Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral pic.twitter.com/9WHYN6IOaq
— Parmeet Singh Bidowali (@ParmeetBidowali) September 6, 2022
డీజిల్ కారు కావడంతో అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలని , అందుకే రేషన్ షాప్‌కు కారును తీసుకొచ్చినట్టు తెలిపారు. తన పేదవాడినే అని , తన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారని , కావాలంటనే దర్యాప్తు చేసుకోవచ్చని చెప్పారు.