AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వినాయక విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. సీన్ కట్ చేస్తే!

వరాత్రులు సందర్భంగా ఓ ప్రాంతంలో వినాయకుడి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది..

Viral Video: వినాయక విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. వినిపించిన వింత శబ్దాలు.. సీన్ కట్ చేస్తే!
Ganesh Idol
Ravi Kiran
|

Updated on: Aug 30, 2022 | 4:51 PM

Share

మరికొన్ని గంటల్లో వినాయక చవితి వేడుకలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలోనే ప్రతీ చోటా గణేషుడ్ని ప్రతిష్టించి పూజలు చేసేందుకు ప్రజలందరూ సన్నద్ధం అవుతున్నారు. నవరాత్రులు సందర్భంగా ఓ ప్రాంతంలో వినాయకుడి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అక్కడున్న కొందరు వ్యక్తులు విగ్రహం కింద నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించారు. ఏమై ఉంటుందా అని చూడగా.. వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు గణేషుడి విగ్రహాన్ని తయారు చేస్తుండగా.. వారికి వింత శబ్దాలు వినిపించాయి. అవేంటని చూడగా.. విగ్రహం కింద రెండు భారీ సైజ్ పాములు నక్కి ఉండటాన్ని గమనించారు. అందులో ఓ పాము బుసలు కొడుతూ.. కాటేయడానికి మీద మీదకు వస్తుండగా.. మరొకటి కూడా దడ పుట్టేంచేలా చుట్టూ ఉన్నవారిని భయపెట్టింది. వెంటనే స్థానికలు సమాచారాన్ని స్నేక్ క్యాచర్‌కు అందించడంతో.. అతడు స్పాట్‌కు చేరుకున్నాడు. ఆ రెండు పాములను తగ్గేదేలే అన్నట్లుగా.. చాకచక్యంగా పట్టుకుని బంధించాడు. అనంతరం తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

కాగా, ఈ వీడియోను స్నేక్ క్యాచర్ మురళీవలే హౌస్లా తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా దీనికి 26 లక్షలకు పైగా వ్యూస్, 62 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే