Viral Video: టైం బ్యాడ్ అయితే ఇంతే.. పురుగును వేటాడబోయి అరటి చెట్టులో ఇరుక్కుపోయిన పిట్ట.. చివరకు..
ఈ భూమిపై జీవించే ప్రతి జీవి పరాన్న జీవే. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధార పడాల్సిందే. మనుషులు మొక్కలు, చిన్న జంతువులను తింటే.. జంతులు మొక్కలు, ఇతర చిన్న జంతువులను తిని బతుకుతాయి. ఇది ఒక జీవన చక్రం. మనందరికీ తెలిసిందే ఈ ముచ్చట.
ఈ భూమిపై జీవించే ప్రతి జీవి పరాన్న జీవే. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధార పడాల్సిందే. మనుషులు మొక్కలు, చిన్న జంతువులను తింటే.. జంతులు మొక్కలు, ఇతర చిన్న జంతువులను తిని బతుకుతాయి. ఇది ఒక జీవన చక్రం. మనందరికీ తెలిసిందే ఈ ముచ్చట. అయితే, ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఓ పక్షికి సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందుకు కారణం ఈ పరాన్న తత్వమే.
అవును, ఓ పక్షి ఆకలితో ఓ కీటకాన్ని తినేందుకు ప్రయత్నించింది. ఓ చెట్టుపై కీటక ఉండగా.. దాన్ని లటుక్కున మింగేద్దామని పెద్దగా, మొనతేలినట్లుగా ముక్కు ఉన్న పక్షి గట్టి ప్రయత్నమే చేసింది. అయితే, ఆ ప్రయత్నం విఫలయత్నం అయ్యింది. కీటకం తప్పించుకుంది. దాని ముక్కు షార్ప్‌గా ఉండటంతో.. అది మొక్కలోకి కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ముక్కు బయటకు రాకపోవడంతో గిలగిలా గింజుకుంది. ఇంతలో ఓ వ్యక్తి దాని అవస్థను గమనించాడు. అయితే, తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భావించిన పిట్ట.. జీవం లేనట్లుగా నటించింది. అతను పట్టుకుని అటూ ఇటూ తిప్పినా.. ఒక రబ్బర్ మాదిరిగా, ప్రాణం పోయినట్లుగా నటించింది. కాసేపటికి ఆ వ్యక్తి చెట్టులో ఇరుక్కుపోయిన ముక్కును బయటకు తీసి పిట్టను తన చేతిలో పెట్టుకోగా.. అలర్ట్ అయిన ఆ పక్షి తుర్రున ఎగిరిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. దాని తెలివి కూడా ఘనమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను కింద చూడొచ్చు..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..