Veteran Car Racer: జాతీయ కారు రేసింగ్ పోటీల్లో ఘోర ప్రమాదం.. వెటరన్ కార్ రేసర్ కుమార్ మృతి..

అదుపు తప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడు కారుని ఢీ కొట్టి.. ట్రాక్‌పై నుండి జారిపడి బోల్తా పడింది. వెంటనే కారు బాడీ భాగాలు విడిపోయాయి. దీంతో వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారు శిథిలాల నుండి కుమార్ ను బయటకు తీశారు.

Veteran Car Racer: జాతీయ కారు రేసింగ్ పోటీల్లో ఘోర ప్రమాదం.. వెటరన్ కార్ రేసర్ కుమార్ మృతి..
Veteran Car Racer Kumar
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2023 | 3:21 PM

తమిళనాడులోని చెన్నై జరుగుతున్న మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇరుంగాటుకోట్టైలోని  ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో 59 ఏళ్ల వెటరన్ కార్ రేసర్ KE కుమార్ ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించాడు. సెలూన్ కార్ల రేసింగ్ ఈవెంట్‌లో రెండో రౌండ్ పోటీల్లో భాగంగా మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడు కారుని ఢీ కొట్టి.. ట్రాక్‌పై నుండి జారిపడి బోల్తా పడింది. వెంటనే కారు బాడీ భాగాలు విడిపోయాయి. దీంతో వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారు శిథిలాల నుండి కుమార్ ను బయటకు తీశారు

ట్రాక్ మెడికల్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కుమార్ ను కాపాడేందుకు వైద్య బృందం శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. చికిత్స పొందుతూ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు.

ఇది చాలా దురదృష్టకర సంఘటన.. కుమార్ ఒక అనుభవజ్ఞుడైన రేసర్ అతను నాకు మంచి స్నేహితుడు.. పోటీదారుడు.. గత కొన్ని దశాబ్దాలుగా తెలుసు.. ఎమ్ఎమ్ఎస్‌సీ ఎఫ్ఎమ్‌సీఐ మీట్ ఛైర్మన్ విక్కీ చంధోక్ పేర్కొన్నారు. కుమార్ మృతికి రేసింగ్ సభ్యులు సంతాపం తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసారు.

ఇవి కూడా చదవండి

కుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ గౌరవార్ధం మిగిలిన రేసులను రద్దు చేస్తున్నట్లు మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (ఎమ్ఎమ్ఎస్‌సీ) తెలిపింది. కాగా జీవిత కాల సభ్యుడు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. మరోవైపు ఎఫ్‌ఎంఎస్‌సిఐ, క్రీడల జాతీయ గవర్నింగ్ బాడీ , ఎంఎంఎస్‌సి నిర్వాహకులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!