AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ ఫుడ్ కి జపాన్ జంట ఫిదా.. వాళ్ళ దేశంలో రెస్టారెంట్.. విస్తరిలో భోజనం..

చాలా మంది విదేశీయులు భారతీయ సంస్కృతి, ఆచారాలు, వంటకాలను ఇష్టపడతారు. భారతదేశాన్ని ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. దీనికి ఉదాహరణ వైరల్ అవుతున్న ఒక వీడియో, దీనిలో భారతదేశం, భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడే జపనీస్ జంట తమ దేశంలో భారతీయ శైలి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తమ దేశంలో ఈ జంట దక్షిణ భారత సంస్కృతి వలె అరటి ఆకులపై వినియోగదారులకు ఆహారాన్ని అందిస్తున్నారు.

భారత్ ఫుడ్ కి జపాన్ జంట ఫిదా.. వాళ్ళ దేశంలో రెస్టారెంట్.. విస్తరిలో భోజనం..
Japanese Couple Running In Indian Style Restaurant
Surya Kala
|

Updated on: Sep 05, 2025 | 9:16 PM

Share

భారతదేశ వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. భారతదేశం ఆహార సంస్కృతి పరంగా కూడా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి రుచికరమైన, వైవిధ్యమైన వంటకాలను విదేశీయులు కూడా ఇష్టపడతారు. అందుకే భారతీయులు విదేశాలలో రెస్టారెంట్లు నిర్వహిస్తారు. సాధారణంగా భారతీయులు విదేశాలలో భారతీయ శైలి రెస్టారెంట్లు,హోటళ్లను నిర్వహిస్తారు. అయితే భారతదేశం, భారతీయ సంస్కృతిని ప్రేమించి, భారతీయ వంటలను నేర్చుకుని.. జపాన్‌లో ఒక రెస్టారెంట్‌ను నడుపుతోంది ఒక జపనీస్ జంట. ఈ జంట రెస్టారెంట్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

భారతీయ రెస్టారెంట్ నడుపుతున్న జపనీస్ జంట: జపాన్‌లోని ఫుకుయోకాలోని కసుగాలో నకయామా-సాన్, సచికో-సాన్ అనే దంపతులు ఇండియన్ స్పైస్ ఫ్యాక్టరీ అనే రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలను రుచి చూడటమే కాదు.. భారతీయ సంస్కృతి వైభవాన్ని కూడా అనుభవించవచ్చు. భారతదేశం , భారతీయ సంస్కృతి పట్ల వారికి గొప్ప ప్రేమ ఉన్నందున వారు ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఈ జంట అరటి ఆకులపై ఫిర్ని, మురుకు వంటి బెంగాలీ వంటలతో పాటు దక్షిణ భారత వంటకాలను వడ్డిస్తారు. అంతేకాదు తమ రెస్టారెంట్ లోపలి భాగాన్ని భారతీయ సంగీత వాయిద్యాలు, కళాకృతులతో అలంకరించారు. సచికో ప్రతిరోజూ భారతీయ చీర ధరించి అతిథులకు ఆహారాన్ని వడ్డిస్తుంది.

వీడియోను ఇక్కడ చూడండి:

View this post on Instagram

A post shared by Sonam Midha (@sonammidhax)

కంటెంట్ సృష్టికర్త సోనమ్ మిధా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, “భారతదేశం, భారతీయ సంస్కృతి పట్ల ఈ జన్తకూ ఉన్న ప్రేమ సాటిలేనిది. మొత్తం అనుభవం హృదయపూర్వకంగా ఉంది” అని క్యాప్షన్ తో షేర్ చేశారు.

జపనీస్ చెఫ్ అయిన నకయామా-సాన్.. కోల్‌కతా, ఢిల్లీతో సహా భారతదేశంలోని అనేక ప్రదేశాలలో 5 సంవత్సరాలు జపనీస్ రెస్టారెంట్‌లను నడిపాడు. ఆ సమయంలో అతను భారతదేశం, భారతీయ సంస్కృతిని ఇష్టపడి..జపాన్‌కు వెళ్ళిన తర్వాత తన దేశంలో భారతీయ శైలి రెస్టారెంట్‌ను నడపడం ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలను అరటి ఆకులపై వడ్డిస్తాడు.

ఆగస్టు 3న షేర్ చేయబడిన ఈ వీడియో 10 లక్షలకు పైగా వ్యూస్, రకరకాల కామెంట్స్ ని సొంతం చేసుకుంది. “మా సంస్కృతి, ఆహారాన్ని గౌరవించినందుకు ధన్యవాదాలు” అని ఒకరు.. మరొకరు, “ఇది చాలా అందంగా ఉంది” అని అన్నారు. జపాన్ జంట భారతదేశం పట్ల చూపిన ప్రేమకు చాలా మంది ముగ్ధులయ్యారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..