అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి పెట్టిన రైతు
అదోలి గ్రామానికి చెందిన ఓ రైతు ఏకంగా తన అవయవాలనే అమ్మకానికి పెట్టాడు. సతీశ్ అనే యువ రైతు బ్యాంకు రుణం తీసుకొని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తర్వాత చెతులెత్తేసింది. దీంతో ప్రభుత్వంపై తన దైన శైలిలో నిరసన తెలిపాలని నిర్ణయించుకొని కిడ్నీలు, కాలేయం అమ్ముతానంటూ ప్లకార్డును పట్టుకొని వీధుల్లో తిరిగాడు.

సోషల్ మీడియాలో ఒక హృదయ విదారక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది నిజంగానే ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించే దృశ్యం.. వ్యవసాయ రుణాలతో విసిగిపోయిన ఒక రైతు తన అవయవాలను కూడా అమ్మకానికి పెట్టాడు. ఆ రైతు తన అవయవాలను అమ్మడానికి ప్రధాన మార్కెట్‌కు వచ్చాడు.. అవయవ అమ్మకాల కోసం తన మెడలో ఒక బ్యానర్ వేలాడ దీసుకుని మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా నిల్చున్నాడు.. తమ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ లేదు. పండిన పంటలు మేము అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఇప్పుడు తాము తీసుకున్న పంట రుణాలు చెల్లించడానికి తమ వద్ద ఏదీ లేదని అందుకే తన అవయవాలను అమ్ముకోవడానికి ఇలా చౌరస్తాలో నిలబడాల్సి వచ్చిందని ఆ రైతు కన్నీటి పర్యాంతం అవుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా అదోలి గ్రామానికి చెందిన ఓ రైతు ఏకంగా తన అవయవాలనే అమ్మకానికి పెట్టాడు. సతీశ్ అనే యువ రైతు బ్యాంకు రుణం తీసుకొని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యాడు. పఢ్నవీస్ ప్రభుత్వం కూడా వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తర్వాత చెతులెత్తేసింది. దీంతో ప్రభుత్వంపై తన దైన శైలిలో నిరసన తెలిపాలని నిర్ణయించుకొని కిడ్నీలు, కాలేయం అమ్ముతానంటూ ప్లకార్డును పట్టుకొని వీధుల్లో తిరిగాడు.
సతీష్ ఐడోల్ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు కూడా అభ్యర్థన పంపినట్టుగా చెప్పాడు. ఎన్నికలకు ముందు రైతులకు పూర్తి రుణ మాఫీ హామీ ఇచ్చారని, ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిందని వాపోయారు. వ్యవసాయ రుణం తిరిగి చెల్లించడానికి మరో మార్గం లేదు, ఆత్మహత్య మాత్రమే మార్గంగా కనిపిస్తోంది” అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఇడోల్‌కు కేవలం రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మహారాష్ట్ర బ్యాంకు నుండి సుమారు రూ.1 లక్ష పంట రుణం చెల్లించాల్సి ఉంది. నేను నా రుణం తీర్చలేను కాబట్టి, నా కిడ్నీని అమ్మినా సరిపోదు. అందుకే, నా భార్య కిడ్నీని రూ.40,000కి, నా పెద్ద కొడుకు కిడ్నీని రూ.20,000కి, నా చిన్న కొడుకు కిడ్నీని రూ.10,000కి అందిస్తున్నాను, తద్వారా నా అప్పు తీర్చవచ్చు” అని ఐడోల్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..