AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫుట్‌బాల్ స్టేడియం గుండా వెళ్లే రైలును మీరు ఎప్పుడైనా చూశారా? సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి..

Viral Video: ఫుట్‌బాల్ స్టేడియం గుండా వెళ్లే రైలును మీరు ఎప్పుడైనా చూశారా? సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Viral Video
Subhash Goud
|

Updated on: Aug 06, 2022 | 5:30 AM

Share

Viral Video: సాధారణంగా మానవ నివాస ప్రాంతాలకు కొద్ది దూరంలో రైలు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ ప్రజలు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి ప్రమాదాలు కూడా జరగవు. అయితే స్టేడియం మధ్యలో రైలు పట్టాలు ఏర్పాటు చేసి రైళ్లు కూడా వెళితే ఎలా ఉంటుంది? ఇది అస్సలు సాధ్యం కాదని అనుకుంటాము. కానీ సాధ్యమైంది. స్టేడియం మధ్యలో రైళ్లు ఎందుకు వెళ్తాయి, అలాంటి చోట ట్రాక్‌లు ఎందుకు ఏర్పాటు చేస్తారు.? అనే అనుమానం రావచ్చు. కానీ ప్రపంచంలో అలాంటి ఒక దేశం ఉంది. ఇక్కడ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఐరోపా దేశమైన స్లోవేకియాలో మీరు ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఫుట్‌బాల్ స్టేడియం మధ్యలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఆటగాళ్ళు ఆడుతున్నారు, ప్రేక్షకులు వారి మ్యాచ్ చూస్తున్నారు.. అప్పుడే నారో గేజ్ రైలు హరన్‌ మోగుతూ వెళ్తోంది. వాస్తవానికి నారో గేజ్ రైల్వే అనేది రైలు ట్రాక్. దీనిలో రెండు ట్రాక్‌ల మధ్య దూరం 2 అడుగుల 6 అంగుళాలు. చిన్న కోచ్‌లతో కూడిన ఈ రైలు ఇప్పుడు చాలా తక్కువ చోట్ల మాత్రమే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలా మైదానం నుంచి రైలు వెళ్తున్నా ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఈ వీడియో @TansuYegen అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేయబడింది. కేవలం 24 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్షల 50 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి