Viral video: వాటే ఐడియా సర్ జీ.. ఈ లాకర్లో డబ్బు దాచుకోవచ్చు.. చివరకు తినొచ్చు.. ఎలాగంటే..
మరికొందరు స్వీట్స్.. జ్యూస్, షేక్స్ ఇలా చాలా రకాలుగా వంటలు చేస్తుంటాయి. తాజాగా చాక్లెట్ ఆర్ట్‌వర్క్ వీడియోలను పంచుకోవడంలో పేరుగాంచిన పేస్ట్రీ చెఫ్ అమౌరీ గుచియోన్ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో జంతువులకు సంబంధించినవి.. కుకింగ్, డ్యాన్స్ .. ఇలా ఒక్కటేమిటీ అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఫుడ్ కు సంబంధించిన వీడియోస్ అనేకం చూస్తుంటాం. కొందరు స్పైసీ ఫుడ్ కు కాస్త విభిన్నంగా ట్రై చేస్తుంటారు. మరికొందరు స్వీట్స్.. జ్యూస్, షేక్స్ ఇలా చాలా రకాలుగా వంటలు చేస్తుంటాయి. తాజాగా చాక్లెట్ ఆర్ట్‌వర్క్ వీడియోలను పంచుకోవడంలో పేరుగాంచిన పేస్ట్రీ చెఫ్ అమౌరీ గుచియోన్ ఓ వీడియోను నెట్టింట షేర్ చేశారు.
అందులో చాక్లెట్ తో లాకర్.. బంగారు కడ్డీలను రెడీ చేశారు. చాక్లెట్ తో తయారు చేసిన లాకర్.. బంగారు కడ్డీలు నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ముందుగా మొత్తం చాక్లెట్ తో లాకర్ రెడీ చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న చాక్లెట్ బార్ లను తయారు చేసి.. వాటిని బంగారు కడ్డిల మాదిరిగా కనిపించేందుకు వాటికి గోల్డెన్ కలర్ పూస్తాడు. ఆ తర్వాత వాటిని లాకర్ లో సెఫ్ గా భద్రపరిచి డోర్ కు లాక్ వేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 11.3 మిలియన్స్ మంది వీక్షకులను ఆకట్టుకుంది. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.