AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన.. నెట్టింట్లో వీడియో వైరల్

రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, మాల్స్ మొదలైన ప్రదేశాలలో ప్రస్తుతం ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు లేదా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీటిని అమర్చారు, అయితే ఎస్కలేటర్‌లపై ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో కొన్నిసార్లు కొంతమంది తప్పులు చేస్తారు. అప్పుడు కొంత మంది గాయపడిన సంఘటలు కూడా ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు తెలుస్తోంది.

Viral Video: ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Aug 04, 2024 | 12:57 PM

Share

ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ వీడియోలు ప్రజల్లో వైరల్ అవుతున్నాయని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి తెలుసు. తమకు బాగా నచ్చిన వీడియోలు చూడడమే కాదు వాటిని షేర్ చేస్తూ సందడి చేస్తారు. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపడితే .. మరికొన్ని వీడియోలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తాయి. చాలాసార్లు కొన్ని రకాల వీడియోల్లోని సంఘటనలు మన కళ్లముందునే జరిగినట్లు అనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత మనం షాక్ అవుతాము. అదే విధంగా ఫన్నీ వీడియోలను పదేపదే చూస్తుంటారు కొందరు. అయితే రీల్స్ పిచ్చితో తమ ప్రాణాలను మాత్రమే కాదు ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత ముందు కోపం వస్తుంది.. తర్వాత పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుంది అంటూ నవ్వు వస్తుంది.

రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు, మాల్స్ మొదలైన ప్రదేశాలలో ప్రస్తుతం ఎస్కలేటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు లేదా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీటిని అమర్చారు, అయితే ఎస్కలేటర్‌లపై ఎక్కే సమయంలో లేదా దిగే సమయంలో కొన్నిసార్లు కొంతమంది తప్పులు చేస్తారు. అప్పుడు కొంత మంది గాయపడిన సంఘటలు కూడా ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇటువంటి సంఘటనే జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా వైరల్ అవుతోన్న వీడియోలో ఇద్దరు మహిళలు ఓ చిన్నారితో కలిసి ఎస్కలేటర్ ఎక్కుతూ రీలు చేస్తున్నారు. ఈ సమయంలో చిన్నారి బాలుడితో ఒక ఆట ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఇద్దరు మహిళలు ఓ చిన్నారి బాలుడి చేతులు పట్టుకుని స్టేషన్‌లోని ఎస్కలేటర్‌ ఎక్కుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో ఇద్దరు స్త్రీలు బాలుడి చేతులు పట్టుకుని గాలిలో ఊపుతూ ఒకొక్క మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా బాలుడి చేయి పట్టుకున్న మహిళ మెట్లపై కూర్చుండి పోయింది. అంతేకాదు ఆ మెట్టు మీద నుండి తన బ్యాలెన్స్ కోల్పోవడం ప్రారంభించింది. పడిపోతూ ఆమె తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే తనను తాను నియంత్రించుకోలేకపోయింది.

ఈ సమయంలో ఆమెను రక్షించడానికి బదులుగా.. కెమెరాలో ఈ సంఘటనను రికార్డ్ చేస్తున్న వ్యక్తి, “అరే, పడిపోయింది..!” అనడం వినిపిస్తోంది. ఈ ఘటనలో పిల్లవాడు భయంతో ఏడ్చాడు. గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోని X లో @divyakumari అనే ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రాణాల కంటే రీల్స్ కు వచ్చే లైక్స్ , కామెంట్స్ ఎక్కువ అంటూ ఆ స్త్రీలను తిడుతూ వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..