Viral Video: షూ వేసుకోబోయిన వ్యక్తికి దిమ్మతిరిగే షాక్.. ఏం జరిగిందో మీరే వీడియోలో చూడండి
Shocking Video: తేళ్లు, పాములంటే చాలామందికి భయం. వాటిని చూస్తేనే ఆమడదూరం పారిపోతారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్‌గా ఉంటున్నాయి...
Shocking Video: తేళ్లు, పాములంటే చాలామందికి భయం. వాటిని చూస్తేనే ఆమడదూరం పారిపోతారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్‌గా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలు చూస్తుంటే ఒళ్లు జలదరింపజేస్తాయి. ప్రస్తుతం అలాంటి పాము వీడియోనే ఒకటి నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా వర్షాకాలంలో విషసర్పాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బయట తిరిగే తేళ్లు, విషసర్పాలు ఇంటి పరిసరాల్లోకి వచ్చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. తన చెప్పుల స్టాండులో ఉన్న షూ లోపల ఒక పెద్ద నాగుపాము ముడుచుకొని పడుకుని ఉండడం అందరినీ గగుర్బాటుకు గురిచేసింది. ఏం చేయాలో తెలియక వెంటనే స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. అయితే ఆ కోబ్రా అతనికి కూడా జంకదు. పడగవిప్పి కాటేసేందుకు ప్రయత్నిస్తుంది.
అయితే తనకున్న అనుభవాన్నంతా రంగరించి ఆ కోబ్రాను షూ నుంచి బయటకు తీస్తాడు స్నేక్ క్యాచర్. చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉండే ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేయగా..క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సుమారు 78 వేలమంది ఈ వీడియోను వీక్షించారు. కాగా చెప్పులు, షూస్ తొడిగే ముందు అదేవిధంగా హ్యాంగర్‌కు తగిలించిన బట్టలు వేసుకునేముందు తప్పకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..