AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కంటిలో త్రివర్ణపతాకం రెపరెపలు..వినూత్న రీతిలో దేశభక్తిని ప్రదర్శించిన సూక్ష్మకళాకారుడు..

ఈ ప్రత్యేక సందర్భంలో భారత ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద దేశంలోని ప్రతి పౌరుడు ఆగస్టు 13 నుండి 15 వరకు తమ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోడీ కోరారు.

Viral News: కంటిలో త్రివర్ణపతాకం రెపరెపలు..వినూత్న రీతిలో దేశభక్తిని ప్రదర్శించిన సూక్ష్మకళాకారుడు..
Artist Paint
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2022 | 6:03 PM

Share

Azadi Ka Amrit Mahotsav: దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. దీనికి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారత ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద దేశంలోని ప్రతి పౌరుడు ఆగస్టు 13 నుండి 15 వరకు తమ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోడీ కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌ నుంచి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వరకు ‘త్రివర్ణ పతాకం’గా మారాయి. కంటికి కనిపించినంత దూరంలో.. ఒకటో రెండో మువ్వన్నెల జెండాలు.. రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి..ఈ క్రమంలోనే ఓ కళాకారుడు ‘హర్ ఘర్ తిరంగ’ గురించి అద్భుతమైన పని చేసాడు. ఇది చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్‌ అవుతారు..ఆశ్చర్యపోతారు.

తమిళనాడులోని కోయంబత్తూరు కి చెందిన UMT రాజా అనే సూక్ష్మ కళాకారుడు.. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15)కి ముందు తన కంటిలో త్రివర్ణ పతాకాన్ని గీసుకున్నాడు.. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయటంతో.. అవి వైరల్‌గా మారాయి. రాజు మొదట కోడి గుడ్డులోని తెల్లసొనపై ఉన్న చాలా పలుచని పొరపై త్రివర్ణ పతాకాన్ని చిత్రించి, ఆపై తన కంటిలోని తెల్లని భాగంలో దాదాపు 20 నిమిషాల పాటు ఉంచాడు. మన మాతృభూమిని మన కళ్లలా కాపాడుకుందాం అన్నాడు!

రాజా తన కుమార్తె (కంటి వైద్యుడు) ఆధ్వర్యంలో ఆదివారం త్రివర్ణ పతాకాన్ని పెయింట్ చేసి తన కంటిలో అతికించారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఈ ప్రయత్నం చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇది మాత్రమే కాకుండా అతను దీన్ని చేయడానికి ముందు గుడ్డులోని తెల్లసొన పొర గురించి అధ్యయనం చేసి అది కంటిని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్ధారించాడు. పెయింట్ కంటికి వ్యాపించినా లేదా కార్నియా దగ్గరికి వెళ్లినా అది చాలా ప్రాణాంతకం అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి
Artist Paints

ఇంతకీ ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంతో  ముఖ్య ఉద్దేశం ఏమిటి..

ప్రభుత్వం ప్రకారం.. ఈ ప్రచారంతో త్రివర్ణ పతాకంతో పౌరుల సంబంధం మరింత బలపడుతుంది. పౌరులలో దేశభక్తి భావనను మరింత పెంపొందేలా చేస్తుంది. ఇకపోతే, కళ్లలో త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన కళాకారుడిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి