BJP MP Varun Gandhi: మరోసారి సొంత పార్టీపైనే భగ్గుమన్న వరుణ్‌.. స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం సిగ్గుచేటు అంటూ..

అనేక సమస్యలపై తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని వరుణ్‌ గాంధీ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వరుణ్‌ గాంధీ మరోమారు కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మరింత ఘాటు విమర్శలు చేశారు.

BJP MP Varun Gandhi: మరోసారి సొంత పార్టీపైనే భగ్గుమన్న వరుణ్‌.. స్వాతంత్య్ర వేడుకలు పేదలకు భారం కావడం సిగ్గుచేటు అంటూ..
Varun Gandhi
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 10, 2022 | 5:00 PM

BJP MP Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)..గతం నుంచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే ప్రజలకు అందించే రేషన్‌ విషయంలో వరుణ్‌ గాంధీ ట్విట్‌ సంచలనం రేపింది. ఎప్పటిప్పుడు అనేక సమస్యలపై తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని వరుణ్‌ గాంధీ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వరుణ్‌ గాంధీ మరోమారు కేంద్రప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మరింత ఘాటు విమర్శలు చేశారు. 75వ స్వాతంత్ర్య వార్షకోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారితే అది దురదృష్టకరం అంటూ ఒక పోస్ట్‌తో ట్విట్టర్‌లో వీడియోను షేర్‌ చేశారు వరుణ్‌ గాంధీ. రేషన్‌ కోసం వెళ్తున్నవాళ్లు.. జాతీయ జెండా కొంటేనే రేషన్‌ ఇస్తామంటూ డీలర్లు బలవంతం చేయడం సిగ్గుచేటంటూ వరుణ్‌ గాంధీ ఆరోపించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో బతుకుతున్న ‘తిరంగ’.. నిరుపేదల ఆహారాన్ని లాగేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వరుణ్‌ గాంధీ వ్యవహరం రాజకీయంగా బీజేపీ పార్టీలో పెను దుమారంగా మారింది.

హర్యానా కర్నల్‌లో జాతీయ జెండా కోసం 20రూ. డిమాండ్‌ చేయడం, అలా కొంటేనే రేషన్‌ ఇస్తామని డీలర్లు బలవంతం చేయడం.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ రేషన్‌ డిపో ఓనర్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. రేషన్‌ డిపోలో జాతీయ జెండాలు అమ్మకానికి ఉంచిన మాట వాస్తవమేనని, అయితే.. కొనుగోలు చేయాలని రేషన్‌ లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ పిక్స్‌గా మువ్వన్నెల జెండాలను ఉంచాలన్న ప్రధాని పిలుపునకు మంచి స్పందనే లభిస్తోంది.

ఈ సందర్భంలోనే.. యూపీ పిలిభిత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ.. ఈ మధ్యకాలంలో కేంద్రంపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనియర్‌ సిటిజన్లకు రైల్వే కన్షెషన్‌ రద్దు చేయండం, ప్యాకేజీ ఫుడ్‌ ఐటెమ్స్‌ మీద జీఎస్టీ, అగ్నిపథ్‌ నియామక ప్రకటనను కూడా విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి