Viral Video: ఓ మై గాడ్..చూస్తుండగానే షాకింగ్.. లోయలో పడ్డ భారీ వంటగ్యాస్ ట్రక్కు..

రోడ్డుపై వెళ్తుంటే కొన్ని సార్లు అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. ఆఇన్సిడెంట్ ని చాలా రోజులు మర్చిపోలేం.. అటువంటి భయానక ఘటనలు నుంచి తేరుకునేందుకు చాలా రోజులు పడుతుంది. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో

Viral Video: ఓ మై గాడ్..చూస్తుండగానే షాకింగ్.. లోయలో పడ్డ భారీ వంటగ్యాస్ ట్రక్కు..
Lpg Truck
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 10, 2022 | 5:04 PM

Viral News: రోడ్డుపై వెళ్తుంటే కొన్ని సార్లు అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. ఆఇన్సిడెంట్ ని చాలా రోజులు మర్చిపోలేం.. అటువంటి భయానక ఘటనలు నుంచి తేరుకునేందుకు చాలా రోజులు పడుతుంది. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్ లో ఇరుకైన రోడ్డులో ఎల్పీజీ గ్యాస్ లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పెద్దలోయలో పడింది. చుట్టుపక్కల ఉన్న జనం వెనుక నుండి అరుస్తున్నా.. డ్రైవర్ కు వినపడకపోవడం.. ఇరుకు రోడ్డులో ముందుకెళ్తూ.. పెద్ద లోయలో పడిపోవడంతో స్థానికులు షాకయ్యారు. ఈనెలలో ముజఫరాబాద్ లో ఈఘటన జరిగిందంటూ అబ్దుల్లా ఆరిఫ్ అనే వ్యక్తి రెడిట్ లో పోస్టు చేశారు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియలో ట్రెండింగ్ అవుతోంది.

ఇరుకైన రోడ్డులో వెళ్తున్న ఆ వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతోనే ఈప్రమాదం జరిగినట్లు వీడియోలో కనబడుతోంది. డ్రైవర్ ఈఇరుకైన మార్గాన్ని దాటడానికి ప్రయత్నించినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి లోయలో పడుతుండగా.. అక్కడి ప్రజలు ఓ మై గాడ్ అంటూ అరవడం వీడియోలో వినబడుతోంది. అయితే ట్రక్కులో ఎంతమంది వ్యక్తులున్నారు. డ్రైవర్ ఏమయ్యాడనే దానిపై క్లారిటీ లేదు. వీడియోని చూసిన కొంతమంది స్థానికులు ఈవీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్ లో రెస్సాండ్ అవుతున్నారు. వాహనంలో డ్రైవర్ వెంటనే దూకేశాడని కొందరు కామెంట్ చేస్తుంటే, వెహికల్ లో డ్రైవర్ ఏమయ్యాడని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఈవీడియో నమశ్చక్యంగా లేదని.. ఫేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి