Watch: ఎత్తైన కొండపై కోతి.. ఎదురుగా డ్యాన్స్ చేస్తున్న యువకులు..వానరం చేసిన పనితో ఒక్కసారిగా…
మనుషుల్లాగా కోతి డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..? లేకపోతే ఇప్పుడే చూడండి. కోతులు, మనుషులు ఒకేలా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టించింది. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా కడుపుబ్బ నవ్వుకుంటారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది యువకుల బృందం ఎత్తైన కొండ ప్రదేశంపై హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు. వారు డ్యాన్స్ చేయడం చూసి ఒక కోతి కూడా వారితో లయబద్ధంగా గెంతులేయడం ప్రారంభించింది. ఈ ఫన్నీ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

కోతి ఎంత సరదాగా, అల్లరిగా ఉన్నా అవి మన పూర్వీకులే..! వానర చేష్టలు చాలా వరకు మనలాగే ఉంటాయి. అవి మనుషులను ఆటపట్టించడం, వస్తువులను లాక్కోవడం చేస్తూ ఆనందిస్తాయి. కానీ, మీరు ఎప్పుడైనా కోతి మనుషులతో కలిసి ఒకేలా డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా? మన బాల్యంలో కోతుల్ని ఆడించేవారు, సర్కాస్‌లో కోతులు చేసే విన్యాసాలను చూసేవాళ్లం. గారడి చేసేవాడు డమరు వాయిస్తాడు. కోతి అతని సంకేతాలపై డ్యాన్స్ చేస్తుంది. కానీ గారడి చేసేవాడు లేకుండా కోతి డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది యువకులు ఎత్తైన కొండ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. అక్కడ వారు ఒక కోతిని చూశారు. ఆ తర్వాత వారు బిగ్గరగా అరవడం మొదలుపెట్టి, చేతులు పైకెత్తి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ యువకులు డ్యాన్స్ చేయడం చూసి, వారికి దూరంగా ఉన్న ఆ కోతి కూడా ఎగురుతూ గెంతులేయటం మొదలుపెట్టింది. యువకులంతా గట్టి గట్టిగా అరుస్తుండటం చూసి ఆ కోతి కూడా మరింత ఉత్సాహంగా ఎగురుతోంది. ఎత్తైన కొండ ప్రాంతంలో, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆ కోతి ఏ మాత్రం భయపడలేదు. తనకు ఎదురుగా ఉన్న మనుషులు ఎలా చేస్తున్నారో.. వారిని అనుకరిస్తూ ఆ బండరాయిపై దూకుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
వీడియో ఇక్కడ చూడండి..
A Group of Boys Made a Monkey Dance pic.twitter.com/7HL5KPuRu1
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 5, 2025
ఈ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్‌లో (గతంలో ట్విట్టర్) @gharkekalesh అనే హ్యాండిల్ షేర్ చేసింది. దీనిని ఇప్పటివరకు 1 లక్ష 82 వేలకు పైగా వీక్షించారు. వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




