AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇదేనా కలికాలం అంటే.. కుందేలును సజీవంగా మింగేసిన పక్షి.. నెటిజన్లు షాక్

సాధారణంగా ఏ సముద్ర పక్షి అయినా సరే చేపలు, కీటకాలు, చిన్న పీతలు, నత్తలను తన ఆహారంగా చేసుకుంటుంది. అంతేకాదు ఒకొక్కసారి చిన్న పక్షులను, పక్షుల గుడ్లను కూడా వేటాడి తింటుంది. అయితే ఎప్పుడైనా బతికి ఉన్న కుందేలుని పక్షి తింటుందని ఎప్పుడైనా అనుకున్నారా.. ఇప్పుడు కుందేలును సజీవంగా పక్షి తింటున్న దృశ్యం ఒకటి వైరల్ అవుతుంది. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది.

Viral News: ఇదేనా కలికాలం అంటే.. కుందేలును సజీవంగా మింగేసిన పక్షి.. నెటిజన్లు షాక్
Seagull Swallows Rabbit Alive
Surya Kala
|

Updated on: Aug 23, 2025 | 7:59 PM

Share

ఒక పక్షి కుందేలును.. అది కూడా సజీవంగా మింగడం మీరు ఎప్పుడైనా చూశారా? లేకపోతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో, ఒక సముద్ర పక్షి సీగల్ ఒక కుందేలును సజీవంగా మింగడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ కళ్ళను నమ్మలేకపోతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఒక సీగల్ కుందేలు నివసించే బొరియ దగ్గర నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. పక్షి మొదట కుందేలును దాని బొరియ నుంచి బయటకు లాగింది.. తరువాత దానిని సజీవంగా మింగేయడం మొదలు పెట్టింది. సీగల్ మొదట కుందేలు తలను తన ముక్కుతో పట్టుకుంది.. ఆ తర్వాత కొద్దిసేపటికే దానిని మింగడం మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఈ సముద్ర పక్షి చేపలు, కీటకాలు, చిన్న పీతలు, నత్తలను తినడం సర్వసాధారణం. దీనితో పాటు ఇవి చిన్న పక్షులను , గుడ్లను కూడా తింటాయి. అయితే ఇప్పటి వరకూ బతికి ఉన్న కుందేలును మింగేసిన పక్షిని మాత్రం చూడలేదు. చాలా మంది నెటిజన్లు సీగల్ చాలా ఆకలితో ఉండవచ్చని.. అందుకే అది అంత పెద్ద ఎరను చాలా సింపుల్ గా తినేసింది అని అంటున్నారు.

ఈ వీడియోను @detailedexplanation అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. సీగల్స్ అవకాశవాద వేటగాళ్ళు అని యూజర్ అన్నారు. ఈ పక్షులు వాటి వాతావరణానికి అనుగుణంగా ఏ రకమైన ఆహారాన్ని అయినా తింటాయి. ఈ అనుకూలత కారణంగా అవి తీర ప్రాంతాల నుంచి నగరాల వరకు ఎక్కడైనా సులభంగా జీవించగలవు. అవి కుందేళ్ళను కూడా మింగేస్తాయని అంటున్నారు.

వీడియో ఇక్కడ చూడండి, పక్షి కుందేలును సజీవంగా మింగేసింది.

వీడియో చూసిన తర్వాత, ఒక యూజర్, “ఓ భాయిసాబ్! అది మొత్తం కుందేలును మింగేసింది” అని కామెంట్ చేశాడు. మరొక యూజర్, “ఇప్పుడు దీన్ని ఎలా జీర్ణించుకుంటుందో అని నేను ఆలోచిస్తున్నాను?” అని కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఇది చాలా భయానక దృశ్యం అని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..