Viral Video: సముద్ర గర్భంలో స్కూబా డైవర్‌తో బుజ్జి ఆక్టోపస్ ఆటలు.. సో క్యూట్ వీడియో
సముద్ర గర్భంలో స్కూబ్ డైవర్ ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. ప్రజంట్ ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Trending Video: నేచర్ చాలా గొప్పది. అది ఎప్పుడూ మనల్ని కాపాడానికి ప్రయత్నిస్తుంటే.. మనం మాత్రం ప్రకృతికి ఎప్పుడూ నష్టం కలిగించే పనులే చేస్తాం. స్వచ్చమైన ప్రకృతిలో ఉన్నప్పుడు మనం చూసే ప్రతిదీ మనకు అందంగానే కనిపిస్తుంది. నేచర్‌లో రకరకాల జీవులు ఉంటాయి. మనుషులేమో అంతా తమకే సొంతం అని భావిస్తుంటారు. ఈ భూమిపై పుట్టే ప్రతి జీవి ఇక్కడ అద్దెకు వచ్చి నివశించినట్టే. ఇక్కడ ఈ ప్రకృతి, ఈ భూమి మాత్రమే శాశ్వతం. ఇక స్కూబా డైవింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. డీప్ సీ డైవింగ్ చేయాలని.. లోపల ఉన్న జీవులను దగ్గర్నుంచి చూడాలని చాలామంది ఆశపడతారు. స్కూబా డైవింగ్ కూడా ధ్యానం లాంటిందే. మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేయడానికి సాయపడుతుంది. సముద్రంలో అనేక రకాల జీవుల్లో.. ఆక్టోపస్ కూడా ఒకటి. వీటిలో చాలామట్టుకు విషం కలిగి ఉండవు. కొన్ని మాత్రం హాని కలిగించగలవు. సేమ్ రూల్.. తమ జోలికి రానంతవరకు అవి అస్సలు దాడి చేయడానికి కూడా సాహసించవు. తాజాగా ఒక స్కూబా డైవర్ సముద్రం లోనికి వెళ్లినప్పుడు… ఒక చిన్న ఆక్టోపస్ అతడికి స్వాగతం పలికింది. ఈ అందమైన చిన్న ఆక్టోపస్ పెట్ మాదిరి ఆ స్కూబా డ్రైవర్ వద్దకు చాలాసార్లు వచ్చింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్ అటువైపే దూసుకెళ్లింది. అతని చేతిపై కూర్చుంది కూడా. అతను ఆక్టోపస్ తల నిమరడం కూడా మీరు చూడవచ్చు. ఈ బుజ్జి ఆక్టోపస్ మనిషితో ప్రెండ్లీగా మూవ్ అవ్వడం చాలామంది నెటిజన్ల మనసులను ఆకట్టుకుంది. మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి.
Playful tiny octopus..
Watch until the end.. ? pic.twitter.com/0omadM5s3w
— Buitengebieden (@buitengebieden) July 15, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి