AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌.. మీరు మేడమ్‌.. మేడమ్‌ అంతే..! స్టాఫ్‌ మెంబర్‌ పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసిన నీతా అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గురించి తెలియని వారు ఉండరు. సాటి మనుషుల పట్ల మానవత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. కోట్లకు పడగలెత్తిన కుబేరురాలైన నీతా...

Viral Video: వావ్‌.. మీరు మేడమ్‌.. మేడమ్‌ అంతే..!  స్టాఫ్‌ మెంబర్‌ పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసిన నీతా అంబానీ
Nita Ambani Celebrates Staf
K Sammaiah
|

Updated on: Dec 01, 2025 | 5:10 PM

Share

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ సతీమణి, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ గురించి తెలియని వారు ఉండరు. సాటి మనుషుల పట్ల మానవత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. కోట్లకు పడగలెత్తిన కుబేరురాలైన నీతా తన ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో చాటి చెప్పే ఓ విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పుట్టినరోజు జరుపుకుంటున్న వీడియో కనిపించిన తర్వాత నెటిజన్స్‌ హృదయాలకు హత్తుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరగా వైరల్ అయిన ఈ క్లిప్, నీతా అంబానీ తన టీమ్ మెంబర్ కోసం ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తున్నట్లు చూపిస్తుంది. తన దగ్గర పని చేసే మహిళా ఉద్యోగి పుట్టిన రోజును నితా అంబానీ స్వయంగా సెలబ్రేట్‌ చేశారు. కేక్‌ కట్‌ చేసి తినిపించి మారీ శుభాకాక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి:

ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలో, టీమ్‌లోని మిగిలిన వారు “హ్యాపీ బర్త్‌డే” పాట పాడుతుండగా, నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పక్కన నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. లేత గోధుమరంగు, ఎరుపు రంగు కో-ఆర్డర్ సెట్‌ దుస్తులు ధరించి, సున్నితమైన చిరునవ్వుతో చప్పట్లు కొడుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత, ఆమె ఒక చెంచా తీసుకొని బర్త్‌డే గర్ల్‌కి ప్రేమగా ఒక చిన్న కేక్ ముక్కను తినిపిస్తుంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో తక్షణమే నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఈ క్లిప్‌ను సిబ్బంది సభ్యురాలు స్వయంగా షేర్ చేసినట్లు తెలిసింది. “నా పట్ల మీరు చూపిన దయకు చాలా ధన్యవాదాలు మేడమ్. మీరు ఎల్లప్పుడూ నా రోజును ప్రత్యేకంగా చేస్తారు, నేను నిజంగా అభినందిస్తున్నాను” అని క్యాప్షన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు నీతా అంబానీని ప్రశంసలతో ముంచెత్తారు. ఒక వినియోగదారు “చాలా దయగలవారు మేడమ్” అని వ్యాఖ్యానించగా, మరొకరు “నీతా మేడమ్ తన సిబ్బంది పుట్టినరోజును జరుపుకుంటున్నారు – చాలా డౌన్ టు ఎర్త్!” అని రాశారు

నీతా అంబానీ తన టీమ్‌ పట్ల ఆప్యాయత చూపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో, నవంబర్ 1న, ఆమె తన సిబ్బందితో జామ్‌నగర్‌లో తన 62వ పుట్టినరోజును జరుపుకున్నారు.