Viral video: కవ్వంతో చిలికిన మేఘాలు ఎప్పుడైనా చూశారా..? అయితే ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..
Mammatus clouds Video: ఆకాశంలో మేఘాలు కనువిందు చేశాయి. కవ్వంతో చిలికినట్లు స్వచ్ఛమైన నురగల్లా.. పాల బంతుల్లా ఏర్పడిన మేఘాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విచిత్రమైన సంఘటన
Mammatus clouds Video: ఆకాశంలో మేఘాలు కనువిందు చేశాయి. కవ్వంతో చిలికినట్లు స్వచ్ఛమైన నురగల్లా.. పాల బంతుల్లా ఏర్పడిన మేఘాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ విచిత్రమైన సంఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. ఈ మేఘాలను చూసి అర్జెంటినా వాసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దూది బంతుల్లా ఏర్పడిన మేఘాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అరుదైన మేఘాల నిర్మాణాన్ని మమ్మటస్ మేఘాలు అంటారు. నవంబర్ 13న కార్డోబాలోని కాసా గ్రాండే ప్రాంతంలో ఆకాశంలో మమ్మటస్ మేఘాలు కనువిందుచేసినట్లు మీడియా వెల్లడించింది. మమ్మటస్ మేఘాలు.. విడివిడిగా.. తెల్లటి బంతుల్లా ఏర్పడతాయి. ఈ మేఘాలు ఏర్పడిన తర్వాత ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అవి వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులతోపాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అయితే.. ఈ మమ్మటస్ మేఘాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ఈ మేఘాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. అయితే.. మరికొందరు అవి వేరే గ్రహానికి చెందినవేమోనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో మమ్మటస్ మేఘాలతోపాటు అన్విల్ క్లౌడ్ లాంటివి కూడా ఏర్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వైరల్ వీడియో..
కాగా.. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మేఘాలు ఇలా కూడా ఏర్పడతాయా..? నిజంగా స్వర్గాన్ని తలపిస్తున్నాయంటూ పలు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి మేఘాలను చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే.. గతేడాది ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పుట్టగొడుగు ఆకారంలో పెద్దగా ఏర్పడిన మేఘం కనువిందు చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: