Divorce: భర్త నుంచి విడాకులు తీసుకుని కుక్కను వివాహం చేసుకుంది.. ఆ తరువాత ఇచ్చిన స్టేట్‌మెంట్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి..!

Divorce: సాధారణంగా ప్రతి దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఎంత కొట్లాట జరిగినా ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది.

Divorce: భర్త నుంచి విడాకులు తీసుకుని కుక్కను వివాహం చేసుకుంది.. ఆ తరువాత ఇచ్చిన స్టేట్‌మెంట్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి..!
God Marriage
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2021 | 6:18 AM

Divorce: సాధారణంగా ప్రతి దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఎంత కొట్లాట జరిగినా ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. అయితే, కొన్ని జంటలు తమ హృదయాల్లో విషాన్ని నింపుకుంటారు. ఇది తదుపరి వివాదానికి ఆజ్యం పోస్తుందని చెప్పాలి. ఇంకొన్నిసార్లు ఇది విడాకుల వరకు చేరుతుంది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ విషయంలోనూ అలాంటిదే జరిగింది. అయితే ఆ తర్వాత ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగక మానదు. విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ కుక్కను పెళ్లి చేసుకుంది. అంతే కాదు, కుక్కతో ఎక్కువ సంతోషంగా ఉందని మహిళ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అసలు ఈ కథ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లండన్‌కు చెందిన అమండా రోడ్జర్స్(47) అనే మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపింది. అయితే, ఆ సమయంలోనే తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది అమండా. ఆ కుక్క పేరు షీబా. అది రెండు నెలల వయసు ఉండగా.. అప్పటి నుంచి ఆమె దానిని ప్రేమిస్తంది. తన పెంపుడు కుక్క కళ్లలో నిజమైన ప్రేమ ఉందని అమండా చెప్పుకొస్తుంది. షెబాను తన భాగస్వామిగా ఎంచుకునే ముందు తాను మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేసినట్లు అమండా తెలిపింది. అయితే, తన ప్రపోజ్‌కు షెబా తోక ఊపుతూ అంగీకారం తెలిపిందన్నారు. ఆ తరువాత 200 మంది బంధుమిత్రుల సమక్షంలో తన పెంపుడు కుక్క షెబాను పెళ్లి చేసుకుంది అమండా. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు షెబాతో హ్యాపీగా ఉంటున్నానంటోంది అమండా. అమండా, షెబా మధ్య ఉన్న ప్రేమ చూసేవారికి విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ.. అమండా మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మనిషితో కంటే షెబాతో చాలా సంతోషంగా గడుపుతున్నానని అమండా చెప్పుకొచ్చింది.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..