Viral Video: కొండచిలువతో సరసాలు…! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే గుండె గుభేలే..
ఈ హృదయ విదారక వీడియోలో, మనిషి కొండచిలువను తన ముఖానికి దగ్గరగా తీసుకురాగానే, అది అతనిపై దాడి చేసి అతని చెంప, ముక్కును కలిపి పట్టుకుంది. కేవలం 32 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ది రియల్ టార్జాన్ అనే ఖాతాతో షేర్ చేయబడింది. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు విపరీతమైన వీక్షణలు, షేర్లు వస్తున్నాయి.
విషపూరిత సరీసృపాల నుండి పది అడుగులు దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచి ఆలోచన అని చెబుతారు. అయితే కొంత మంది మాత్రం వాటితో స్నేహం చేస్తుంటారు.. మరికొందరు వాటితో చెలరేగిపోయి స్టంట్స్ చేస్తుంటారు. ఇంటర్నెట్‌లో తరచుగా కనిపించే ఇటువంటి వీడియోలలో ప్రమాదకరమైన జీవులను వేధించడం వల్ల కలిగే పరిణామాలు కూడా కొన్నిసార్లు కనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ కొండచిలువతో ఏదో ఎకసెకలు చేయాలని చూశాడు.. కానీ, అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఎంతకైనా అది పాము.. పాలు పోసి పెంచినా కూడా విషాన్నే చిమ్ముతుంది..ఇక్కడ కూడా అదే జరిగింది.. ఆదమరిస్తే ఏం జరుగుతుందో నిరూపించింది..ఇంతకీ వైరల్ ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే..
ఇటీవల వైరల్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి భారీ కొండచిలువను చేతిలో పట్టుకుని కెమెరాకు పోజులివ్వడానికి ప్రయత్నించాడు.. అతడు ఆ కొండిచిలువను తన ముఖానికి చాలా దగ్గర పట్టుకుని సరదాగా ఏదో మాట్లాడుతున్నాడు.. అంతలోనే ఆ పాము ఒక్కసారిగా అతనిపై దాడికి దిగింది. రెప్పపాటులో ఆ కొండచిలువ సదరు వ్యక్తి ముఖంపై దాడి చేసి అతని ముఖాన్ని గట్టిగా పట్టేసింది. దాన్ని వదిలించుకోవటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. ఓ పక్క పాముకాటు నొప్పిని భరిస్తూనే.. దాన్ని కాటు నుండి వదిలించుకోవాలని చూస్తున్నాడు.. అయితే ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
View this post on Instagram
ఈ హృదయ విదారక వీడియోలో, మనిషి కొండచిలువను తన ముఖానికి దగ్గరగా తీసుకురాగానే, అది అతనిపై దాడి చేసి అతని చెంప, ముక్కును కలిపి పట్టుకుంది. కేవలం 32 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ది రియల్ టార్జాన్ అనే ఖాతాతో షేర్ చేయబడింది. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు విపరీతమైన వీక్షణలు, షేర్లు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన యూజర్లు దానికి భిన్నమైన రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ‘ఇది మూర్ఖత్వం అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..