AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన నిండు గర్భిణీ .. డాక్టర్, డ్యాన్సర్ కూడా..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నెటిజన్లను బిగ్గరగా నవ్విస్తాయి. మరికొన్ని వీడియోలు నెటిజన్ల నోటి మీద వేళ్లు పట్టుకునేలా చేస్తాయి. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో నిండు గర్భవతి బాలీవుడ్ పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. మరికొందరు వావ్ అంటూ ప్రసంశిస్తున్నారు.

Viral Video: బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన నిండు గర్భిణీ .. డాక్టర్, డ్యాన్సర్ కూడా..
Viral Video
Surya Kala
|

Updated on: May 08, 2025 | 9:03 PM

Share

తల్లి కావడం ఓ అదృష్టం. బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ స్త్రీకి మరుజన్మలాంటిది. అందుకే గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు. బరువైన వస్తువులను ఎత్తడం, శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో కవల పిల్లలల్ని మోస్తున్న గర్భిణీ స్త్రీ బాలీవుడ్ పాట డింగ్ డాంగ్ డోల్ కు కొరియోగ్రాఫర్ తో కలిసి అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈ మహిళ వృత్తిరీత్యా వైద్యురాలు, నృత్యకారిణి కూడా. ఆమె డాక్టర్. ఈ నిండు గర్భిణి డాక్టర్ సోనమ్ దహియా నృత్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆర్టిస్ట్ డ్యాన్స్ కమ్యూనిటీ అనే ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో నిండు గర్భవతి అయిన డాక్టర్.. కొరియోగ్రాఫర్ ఆదిల్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ పాట ‘డింగ్ డాంగ్ డింగ్’కి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపిస్తుంది. సోనమ్ దహియా అద్భుతంగా నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. ఈ డ్యాన్స్ వీడియోతో సోనమ్ గర్భం, ఫిట్‌నెస్ గురించి కొన్ని ఆలోచనలను పంచుకుంది. తన కల నెరవేరుతుందని కూడా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోతో పాటు ఆదిల్ ఖాన్‌తో కలిసి నృత్యం చేసే అవకాశం లభించినందుకు థాంక్స్ చెప్పింది డాక్టర్. ఈరోజు తన కల నిజమైంది” అని చెప్పింది. ఈ వ్యాయామం.. తన వ్యక్తిగత ప్రయాణం, వ్యాయామం చేసేటప్పుడు నేను ఏమి ధరిస్తాను నేను ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది తన ఎంపిక అని చెప్పింది. ఆరోగ్యకరమైన శారీరక శ్రమ సురక్షితమైనది. ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది. ఈ శారీరక వ్యాయామం గర్భస్రావం, తక్కువ బరువుతో శిశివు జననం లేదా నెలలు నిండకుండా పిల్లలు పుట్టే సమస్యలను దూరం చేస్తుందని వెల్లడించింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

అయితే ఇలా గర్భిణీ స్త్రీలు ఏదైనా శారీరక శ్రమ చేయాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి వారు చేస్తున్న పని వలన ఎటువంటి ప్రమాదం ఉండదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఏ కారణం చేతనైనా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ తాము సరైనది అని భావించేదాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని చెప్పారు.

ఈ వీడియోను ఇప్పటి వరకూ డెబ్బై ఐదు వేలకు మందికి పైగా వీక్షించారు. గర్భిణీ స్త్రీ డ్యాన్స్ చూసి వినియోగదారులు షాక్ అయ్యారు. “ఈ సమయంలో ఇలా డ్యాన్స్ చేయడం..అద్భుతం.. మీ ధైర్యానికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను” అని ఒకరు అన్నారు. మరొకరు, ‘నువ్వు నిస్సందేహంగా అద్భుతమైన నర్తకివి’ అని అన్నారు. ” గర్భవతిగా ఉన్నప్పటికీ అద్భుతంగా నృత్యం చేశారని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు, “కవలలకు తల్లి అయిన తర్వాత కూడా నువ్వు ఇలాగే డ్యాన్స్ చేస్తూనే ఉండాలి ని కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..