మీరెప్పుడైనా ఇలా వంటచేశారా ?? మిలియన్లమంది
సోషల్ మీడియా వినూత్న ఆలోచనలకు, కొత్త కొత్త ప్రయోగాలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు ఇవి వింతగా అనిపించినా, ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా ఓ వ్యక్తి వినూత్న పద్ధతిలో వంట చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఒకే కడాయిలో ఏకంగా రెండు రకాల వంటకాలను ఏకకాలంలో వండి అందరినీ అబ్బురపరిచాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి వంట కోసం ఒక లోతైన కడాయి తీసుకున్నాడు. దాని మధ్యలో గోధుమపిండి ముద్దతో ఒక అడ్డుగోడలా ఏర్పాటుచేసి, కడాయిని రెండు విభాగాలుగా విభజించాడు. ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక వైపు రుచికరమైన బంగాళాదుంప కూర వండుతూనే, మరో వైపు రొట్టెలను కాల్చాడు. ఈ జుగాడ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఏకంగా 122 మిలియన్లమందికి పైగా వీక్షిఒంచారు. వంట ప్రియులతో పాటు, సరదా మీమ్స్ ఇష్టపడే వారు కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు, ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇది వంట కాదు, టెక్నాలజీ అని కొందరు, ఈ టెక్నాలజీ అస్సలు ఇండియా దాటి బయటకు వెళ్లకూడదు అని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండగా చూసిన పేరెంట్స్ ఆ తర్వాత ఏమైంది అంటే ??
TOP 9 ET News: కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా హృతిక్! సీక్రెట్‌గా ముగిసిన మహాభారతం సినిమా!
ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు.. ఎందుకంటే ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

