డ్రంక్ అండ్ డ్రవై చెక్ చేస్తున్న పోలీసులపై మందుబాబులు పైర్ వీడియో
మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు. హల్చల్ చేయడం వరకు ఓకే. కానీ ఏకంగా పోలీసుల పైననే తిరగబడ్డారు. డ్రంకున్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసుల పై మందుబాబులు దాడి చేయడం అందరినీ షాక్ కి గురిచేసింది. మెదక్ జిల్లా శివంపేట ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంకున్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల పైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివంపేట నుంచి చండి వైపు వస్తున్న ఒక బైక్ పై ముగ్గురు మరో బైక్ పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అయితే వారు హెల్మెట్ ధరించలేదు
అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి డ్రంకున్ డ్రైవ్ కు సహకరించాలని కోరారు స్థానిక పోలీసులు. దీంతో మద్యం మత్తులో ఉన్న మందుబాబులు రెచ్చిపోయారు. మమ్మల్ని ఆపుతారా అని బూతులు తిడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చిందులేశారు. అంతటితో ఆగకుండా చేతులతో అక్కడ ఉన్న ముగ్గురు పోలీసులపై దాడి చేశారు. దీన్ని ఆపడానికి వచ్చిన మరో ఇద్దరు పోలీసులపై సైతం దాడి చేయడంతో వారంతా షాక్ కి గురయ్యారు. చివరకు స్థానికంగా పనిచేసే భారత్ గ్యాస్ సిబ్బంది సహకారంతో ఆ ఐదుగురు మందుబాబులను అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో సైతం పోలీసులు గల్లాలు పట్టి బూతులు మాటలు తిడుతూ దాడికి ప్రయత్నించారు మందుబాబులు. దీంతో ఎం.డి. రషీద్, భానావత్ సాయిద్ నాయక్, భూయా భీమా నాయక్, గంగోలు గోపి నాయక్, భానావత్ నందు నాయకులపై శివంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి దూషిస్తూ విచక్షణారహితంగా దాడి చేసినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని శివంపేట పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్క లీటరు పాలు రూ. 5 లక్షలు.. ఏమిటా స్పెషాలిటీ వీడియో
కట్నం వద్దు.. వధువే ముద్దు..వీడియో
ఇబ్బందుల్లో నటి.. వన్య ప్రాణుల మాంసం రుచి చూడటం వల్ల వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
