ఖతర్నాక్ పాము.. స్నేక్ క్యాచర్‌కే షాకిచ్చిందిగా
ఎండలు మండిపోతున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడుతున్నా భూతాపం మరింత పెరిగి వనాల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు చల్లదనాన్ని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలా ఇళ్లలో చేరి జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏసీలు, కార్లు, పెరట్లోని మొక్కలు ఇలా ఎక్కడబడితే అక్కడ చేరుతున్నాయి.
ఇటీవల పశువుల పాకలోని కమ్మల్లో చేరి స్నేక్ క్యాచర్‌ను ముప్పు తిప్పలు పెట్టింది ఓ కింగ్ కోబ్రా.. ఇంట్లోని బీరువాపై పడగవిప్పి కూర్చుని మహిళను పరుగులు పెట్టించింది మరో నాగుపాము.. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. కర్నాటక దావణగెరె నగరంలోని ఏపీఎంసి ప్రాంగణంలోని చెట్ల పొదల్లో దూరింది ఓ పాము. చెట్ల మధ్య నుంచి వింత శబ్దాలు రావడంతో గమనించిన స్థానికులు అక్కడ భారీ నాగుపామును చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకోడానికి ప్రయత్నించగా.. ఊహించని విధంగా ఆ పాము అతని మెడను చుట్టేసింది. ఒక్క క్షణం షాకైన స్నేక్ క్యాచర్ పాము నుంచి విడిపించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. కాసేపు ఏం జరుగుతుందోనని అందరిలో ఆందోళన నెలకొంది. చివరికి జాగ్రత్తగా పామును తన మెడ నుంచి విడిపించుకున్నాడు. ఆ తర్వాత దానిని తీసుకువెళ్లి సురక్షితంగా అటవీప్రాంతంలో వదలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాము మెడకు చుట్టుకున్నా అతనికి ఎలాంటి హానీ తలపెట్టకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెల్లం, సోంపు కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో పరార్
Avocado: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే అద్భుత ప్రయోజనాలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

