AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇసొంటివే వద్దనేది మరి.. తోముతరు లేదంటే…! బీర్‌ ప్రాంక్‌ వీడియోపై నెటిజన్స్‌ గుస్సా!!

సోషల్‌ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక ఏదో రకంగా ఫేమస్‌ కావాలనే ధోరణి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఆప్‌లోడ్ చేస్తుంటారు. అందులో కొన్ని ఫన్నీగా అనిపిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి వాటిలో ప్రాంక్‌ వీడియోలు ఒకటి. ప్రాంక్‌ వీడియో చేయడం అనేది...

Viral Video: ఇసొంటివే వద్దనేది మరి.. తోముతరు లేదంటే...! బీర్‌ ప్రాంక్‌ వీడియోపై నెటిజన్స్‌ గుస్సా!!
Beer Prank
K Sammaiah
|

Updated on: May 13, 2025 | 8:45 PM

Share

సోషల్‌ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చాక ఏదో రకంగా ఫేమస్‌ కావాలనే ధోరణి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఆప్‌లోడ్ చేస్తుంటారు. అందులో కొన్ని ఫన్నీగా అనిపిస్తే మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి వాటిలో ప్రాంక్‌ వీడియోలు ఒకటి. ప్రాంక్‌ వీడియో చేయడం అనేది ఆ మధ్య ఓ క్రేజ్‌లా మారింది. చాలా మంది ప్రాంక్‌ వీడియోల ద్వారానే పాపులర్‌ అయ్యారు. మరికొంత మంది ప్రజల ఆగ్రహానికి గురై దెబ్బలు కూడా తిన్నారు.

ప్రాంక్‌ వీడియోల పేరుతో విచ్చలవిడిగా హద్దు మీరి ప్రవర్తించడంతో రోడ్డు మీద గొడవలు జరిగిన సందర్బాలు ఉన్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న యువతిపై బీరు ప్రాంక్ చేయడంతో లేనిపోని చిక్కులు కొని తెచ్చుకున్నారు. ఆ యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్స్‌ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలోని దృశ్యాల ప్రకారం ఓ యువతి తన స్నేహితురాళ్లతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతోంది. చేతిలో బీరు మగ్గుతో ఉన్న యువకుడు వారిని ఆగాలని కోరతాడు. తర్వాత నీళ్లు కావాలని అడిగాడు. తాగడానికి నీళ్లు అడుగుతున్నాడేమో అనుకున్న యువతి బ్యాగులో నుంచి నీళ్ల బాటిల్‌ తీసి ఇవ్వబోతుంది. అయితే అతని చేతిలో బీరు మగ్గు ఉండటంతో నీళ్ల బాటిల్‌ ఇచ్చేందుకు నిరాకిరస్తుంది. అప్పుడు ఆ యువకుడు మగ్గులోని బీరును ఆమె మీద పోస్తున్నట్లు నటిస్తాడు. దీంతో ఆ యువతి భయపడిపోయింది.

వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by PrankBuzz (@prankbuzz)

ఆ వెంటనే అతడిపై యువతి కోపం కట్టలు తెంచుకుంది. యువతి స్నేహితురాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్స్‌ ఆ యువకుడిపై మండిపడుతున్నారు. ఆడవాళ్లకు కొంతైన మర్యాద ఇవ్వండి అంటూ పోస్టులు పెడుతున్నారు. కామెడీగా లేదు.. వాళ్లను వేధిస్తున్నట్లు ఉంది, ఊరికే వదిలిపెట్టవద్దు. పోలీసులు చర్యలు తీసుకోవాలి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్