AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మేమున్నాం ! చెయ్యరా స్నానం ! కుక్కకు చింప్‌ల బాత్ డబ్ !

ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోందా వీడియో ! చూసినవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. నవ్వుకున్నారంటే.. నవ్వుకోరూ మరి ? ఓ కుక్క యజమాని… తన కుక్కకు బాత్ డబ్ లో స్నానం చేయిస్తుంటే అతగాడు పెంచుకుంటున్న రెండు చింపాంజీలు కూడా తలో ‘ చెయ్యీ వేశాయి ‘. సబ్బు నురగలను ఆస్వాదిస్తూ ఆ కుక్కగారు కూడా ఈ స్నానాన్ని ఎంజాయ్ చేసింది. మధ్య..మధ్య ఓ చింపాంజీ తానూ ఒళ్ళు రుద్దుకుంటుంటే ఇక ఆ ‘ యవ్వారం ‘ కళ్ళార్పకుండా […]

' మేమున్నాం ! చెయ్యరా స్నానం ! కుక్కకు చింప్‌ల బాత్ డబ్ !
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:48 PM

ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోందా వీడియో ! చూసినవాళ్లంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. నవ్వుకున్నారంటే.. నవ్వుకోరూ మరి ? ఓ కుక్క యజమాని… తన కుక్కకు బాత్ డబ్ లో స్నానం చేయిస్తుంటే అతగాడు పెంచుకుంటున్న రెండు చింపాంజీలు కూడా తలో ‘ చెయ్యీ వేశాయి ‘. సబ్బు నురగలను ఆస్వాదిస్తూ ఆ కుక్కగారు కూడా ఈ స్నానాన్ని ఎంజాయ్ చేసింది. మధ్య..మధ్య ఓ చింపాంజీ తానూ ఒళ్ళు రుద్దుకుంటుంటే ఇక ఆ ‘ యవ్వారం ‘ కళ్ళార్పకుండా చూడాల్సిందే ! సౌత్ కెరొలినాలోని మైర్టయిల్ సఫారీ బీచ్ లో ఓ సాయంత్రం జరిగిందీ సరదా వైనం ! సోషల్ మీడియాలో ఈ వీడియోను లక్షలాది మంది చూసి ఎంజాయ్ చేస్తే.. కొందరు మాత్రం జంతువులను ఇలా ‘ యాక్ట్ ‘ చేయమనడం ఏమైనా బాగుందా ‘ అంటూ పెదవి విరిచారు. అన్నట్టు ఆ చింపాంజీల పేర్లు ఒకటి వాలి.. అయితే మరొకటి ‘ సుగ్రీవ ‘ అట ! అంటే రామాయణంలోని వాలి, సుగ్రీవుల కథ కూడా వీటి యజమానికి బాగా తెలిసే ఉండాలి.

View this post on Instagram

Splish splash doggo taking a bathe ?♾? @myrtlebeachsafari

A post shared by Kody Antle (@kodyantle) on