Viral Video: పులితోనే ఆటాలా..? దాగుడు మూతలు ఆటాడిన బాతుకు షాకిచ్చిన స్మార్ట్ టైగర్.. వీడియో
Tiger - Duck Shocking Video: సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
Tiger – Duck Shocking Video: సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. జంతువుల వేటకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. తాజాగా పులులకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అటవీ ప్రపంచంలో.. పులి కంటే చురుకైన, తెలివైన జంతువు లేదు. అది ఎరను క్షణంలో వేటాడగలదు. అందుకే.. అడవిలోని అతి పెద్ద జంతువులు పులి దగ్గరికి రావడానికి భయపడుతుంటాయి. తాజాగా పులి వేటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో భయంకరమైన మూడు పులులు నీటి కొలనులో బాతును వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ వీడియోను చూసి పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలు.. మూడు భయంకరమైన పులులు చిన్న బాతును వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మూడు కూడా బాతును వేటాడేందుకు చాలా సేపు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాయి. అయితే.. బాతు మూడు పులులకు చుక్కలు చూపిస్తూ.. దాగుడు మూతల ఆట ఆడుతుంటుంది.
బాతు పులులకు ఝలక్ ఇస్తూ తప్పించుకు తిరుగుతుంటుంది. ఓ పులి దగ్గరికి రాగానే నీళ్లలో మునుగి మరోచోట తేలుతుంది. ఈ క్రమంలో పులి ఒక్కసారిగా అటాక్.. చేసి బాతును పట్టుకుంటోంది. అయితే.. బాతు పులి నుంచి తప్పించుకోవాలనుకున్నా.. దాని ఆశ ఫలించలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్మార్ట్ టైగర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
వైరల్ వీడియో..
View this post on Instagram
టైగర్ – డక్ వీడియోను beauty.wildlifee అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. దీన్ని వేలాది మంది వీక్షించి పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బాతు దాగుడు మూతలు ఫలించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: