Viral Video: మనుషిని మించిపోయిన శునకం.. ఈ పెట్ డాగ్ తెలివిని చూస్తే మీరూ ఇదే అంటారు..
Viral Video: విశ్వాసానికి శునకాలను మారుపేరుగా చెబుతుంటారు. అయితే కేవలం విశ్వాసంలోనే కాదు తెలవితేటల్లోనూ అవి ఇతర జంతువులకంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు శునకాలు చేసే పనులు చూస్తే ఇది ముమ్మాటికి నిజం అనిపించకమానదు..
Viral Video: విశ్వాసానికి శునకాలను మారుపేరుగా చెబుతుంటారు. అయితే కేవలం విశ్వాసంలోనే కాదు తెలవితేటల్లోనూ అవి ఇతర జంతువులకంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు శునకాలు చేసే పనులు చూస్తే ఇది ముమ్మాటికి నిజం అనిపించకమానదు. కుక్కలు తమ పనులతో నవ్వు తెప్పించడమే కాకుండా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే వైరల్ అవుతోంది. ఓ శునకం చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇంతకీ విషయమేంటంటే.. ఓ యజమాని తన పెంపుడు శునకాన్ని రింగులో నిల్చొమని ఆదేశించాడు. తాను చెప్పే వరకు అక్కడి నుంచి కదలొద్దు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ కుక్కకు ఎదురుగా ఉన్న టేబుల్‌పై చికెన్ ముక్క ఉంది. చికెన్ చూడగానే శునకానికి నోరురింది. ఓవైపు చికెన్ తినాలనే కోరిక, మరోవైపు యజమాని రింగ్ దాటకూడదని చెప్పిన ఆర్డర్‌ను జవదాటకూడదనే భయం. దీంతో ఆ శునకం ఓ సూపర్ ఐడియా చేసింది.
మనుషులనే మించే తెలివి తేటలను ప్రదర్శించింది. సదరు రింగును నెమ్మదిగా టేబుల్ వరకు జరిపి ఎంచక్కా చికెన్‌ను లాగించేసింది. ఇలా యజమాని ఆదేశాలను పాటిస్తూనే, చికెన్ ముక్కను తినేసిందా శునకం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శునకం తెలివి తేటలకు అవాక్కవుతున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Viral: ఫూల్స్ డే రోజున వచ్చిన ఫోన్ కాల్.. దెబ్బకు ఎంక్వయిరీ చేయగా మైండ్ బ్లాంక్.!
Mango Side Effects: వేసవిలో మామిడి పండు తింటే మంచిదే.. అయితే వీరు మాత్రం అస్సలు తినకూడదు!