AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అంత అవసరమారా బాబు..బొక్కలు ఇరిగినట్టున్నయిగా… స్టంట్‌ రీల్‌తో హీరో కావాలనుకున్నాడు.. జీరో అయ్యాడు

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలనే ఆలోచనలో ప్రణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి ఫ్లైఓవర్‌ గోడ మీద నిలబడి ఉన్నట్లు...

Viral Video: అంత అవసరమారా బాబు..బొక్కలు ఇరిగినట్టున్నయిగా... స్టంట్‌ రీల్‌తో హీరో కావాలనుకున్నాడు.. జీరో అయ్యాడు
Stunt Fail On Flyover
K Sammaiah
|

Updated on: Aug 25, 2025 | 4:44 PM

Share

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. రకరకాల రీల్స్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవాలనే ఆలోచనలో ప్రణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి ఫ్లైఓవర్‌ గోడ మీద నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అతను వెనక్కి తిరిగి, ఒక వ్యాన్ కిందకు వెళుతుందని చూసి, ఏమీ ఆలోచించకుండా, ఫిల్మీ స్టంట్ చేస్తూ దూకుతాడు. సినిమాల్లో ఇలా దూకినప్పుడు నేరుగా వాహనంపై పడటం చూస్తుంటాం. కానీ, ఇది రియల్‌ లైఫ్‌ కదా.. అతడి అంచనా బెడిసి కొట్టింది. కొన్ని సెకన్లలో అతని లెక్కలు తప్పుగా మారతాయి. ఫ్లైఓవర్‌ మీది నుంచి నేరుగా నేలపై పడతాడు. అతని పరిస్థితిని చూస్తుంటే పెద్ద గాయాలే అయినట్లు అనిపిస్తుంది. అతని ఎముకలు కూడా విరిగి ఉండాలి. ఇది ఎక్కడ జరిగిందనేది ఎటువంటి సమాచారం లేదు, కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.

వీడియోలో ఆ వ్యక్తి ఒక వంతెన కొనాకు నిలబడి స్టంట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక వ్యాన్ కిందకు వెళుతుండటం వల్ల అతను తన స్టంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ వ్యాన్‌పై సులభంగా దుంకగలనని అతను భావిస్తాడు. అటువంటి పరిస్థితిలో అతను సినిమా స్టంట్ లాగా దూకుతాడు. ఈ క్రమంలో ఆతడు ఊహించని విధంగా వ్యాన్‌లో కకుండా నేరుగా కింద పడిపోతాడు. అతని వీపుపై భయంకరమైన గాయం అవుతుంది.

ఈ పెద్దమనిషి రీల్ చేయడానికి ఫ్లైఓవర్ ఎక్కాడు. చెత్త వాహనం తన ముందు వచ్చిన వెంటనే, అతను దానిపైకి దూకులాని ఆ రీల్ వైరల్ అవుతుందని అతను అనుకున్నాడు. చెత్త ట్రక్కు అతని ముందు వచ్చింది కానీ అతను దూకడం ఆలస్యం అయింది. అదే అతని జీవితానికి ముగింపు అయింది. ఇప్పుడు ఈ పెద్దమనిషి జీవితంలో ఎప్పటికీ రీల్ చేయడు

వీడియో చూడండి:

ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది చూశారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇప్పుడు ఈ వ్యక్తి సరిగ్గా నిలబడలేడని, స్టంట్స్ గురించి మర్చిపో అని రాశారు. అలాంటి వాడి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.