AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! ఎంత ‘పేద్ద’ కొండచిలువో.. ఒట్టి చేతులతో ఇట్టే పట్టేశాడుగా.. చూస్తే హడల్..

ఓ గుంపు అడవిలో అందమైన దృశ్యాలను బంధిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతలోగా వారికి భారీ కొండచిలువ ఒకటి అడ్డొచ్చింది. ఇంకేముంది.!

Viral Video: వామ్మో! ఎంత 'పేద్ద' కొండచిలువో.. ఒట్టి చేతులతో ఇట్టే పట్టేశాడుగా.. చూస్తే హడల్..
Python
Ravi Kiran
|

Updated on: May 01, 2023 | 10:14 AM

Share

ఓ గుంపు అడవిలో అందమైన దృశ్యాలను బంధిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతలోగా వారికి భారీ కొండచిలువ ఒకటి అడ్డొచ్చింది. ఇంకేముంది.! అందరూ భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. అయితే ఈలోగా ఓ వ్యక్తి ఏమాత్రం జంకకుండా కొండచిలువను వెంటపడి మరీ.. దాని తలను పట్టుకుని బంధిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి..

వీడియో ప్రకారం.. ఓ గుంపునకు అడ్డొచ్చింది ఒక భారీ కొండచిలువ. చాలామంది దాన్ని చూసి పరుగులు పెట్టగా.. ఓ వ్యక్తి మాత్రం కొండచిలువను పట్టుకుని బంధించాడు. పొదల్లోకి వెళ్తున్న దాని తలను గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆ కొండచిలువ మాత్రం ఆ వ్యక్తిని చంపేయడానికి ప్రయత్నించింది. అందులో భాగంగా అతడ్ని చుట్టేస్తుంది. అయితే సదరు వ్యక్తి చాలా తెలివిగా.. దాని తలను వదలకుండా మధ్య మధ్యలో కొండచిలువను పక్కకు నెట్టేశాడు. చివరికి ఆ పేద్ద కొండచిలువను త్రాడులా ఇట్టే చుట్టేస్తాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.