AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అద్భుతమైన దృశ్యం.. దేవ దూతలా దివి నుంచి భువికి దిగిన తెల్లని నెమలి.. వీడియో వైరల్

White Peacock: ఉత్తర ఇటాలియన్( North Italian) ఐసోలా బెల్లా(Isola Bella) ద్వీపం తెల్లటి నెమలి ఆకాశం నుంచి దేవ దూతలా నేలమీదకు దిగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో..

Viral Video: అద్భుతమైన దృశ్యం.. దేవ దూతలా దివి నుంచి భువికి దిగిన తెల్లని నెమలి.. వీడియో వైరల్
White Peacock Viral Video
Surya Kala
|

Updated on: Apr 30, 2022 | 6:25 PM

Share

White Peacock: ఉత్తర ఇటాలియన్( North Italian) ఐసోలా బెల్లా(Isola Bella) ద్వీపం తెల్లటి నెమలి ఆకాశం నుంచి దేవ దూతలా నేలమీదకు దిగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బరోక్ గార్డెన్‌లోని శిల్పం దగ్గర నుంచి తన అందమైన తెల్లటి పొడవాటి తోకను ఊపుకుంటూ.. నేలమీదకు దిగుతున్న వీడియో వైరల్ అవుతోంది.  అరుదైన నెమలి పొడవాటి, తెల్లటి తోకతో భూమిపై తన వైభవాన్ని చాటడానికి రెక్కలు విప్పి రమణీయంగా ఎగురుతున్న తీరు నిజంగా చూడదగ్గ దృశ్యం.

నెమలి అంటేనే దాని అందమైన పించం.. సప్తవర్ణాలతో అందంగా కనువిందు చేస్తుంది. ఇది సర్వసాధారణంగా అందరికీ కనిపించే దృశ్యం. అయితే  తెల్లని నెమళ్లకు రంగు ఉండదు. తెల్ల నెమలి మొత్తం భూమిలో అత్యంత అద్భుతమైన పక్షి. ఇది సున్నితత్వం, అందం , విపరీతమైన మేజిక్ కలిగి ఉంటుంది. ఈ తెల్లని నెమళ్ళకు లూసిజం అని పిలువబడే జన్యు పరివర్తన  వీటి ఈకలలో వర్ణద్రవ్యం చేరకుండా నిరోధిస్తుంది. అందమైన తెల్లటి రూపాన్ని ఇస్తుంది. ఇవి ఎక్కువగా భారత ఉపఖండానికి చెందివి. ఈ అరుదైన పక్షులు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా  కొంతమంది వీటిని పెంచుకుంటున్నారు. చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఈ వైట్ నెమలి లేదా ఇండియన్ నెమలి అనేది ఇండియన్ బ్లూ నెమలికి ప్రజాతి. ఇది దక్షిణ ఆసియాకు చెందినది. నెమళ్లు తన పొడవైన తోక సాయంతో ఈజీగా ఎగురుతాయి. అయితే ఎక్కువ కాలం గాలిలో ఉండలేవు. వాటి భారీ రెక్కలు  చాలా దూరం ఎగరడానికి సహకరిస్తాయి. ‘Yoda4ever’ అనే వినియోగదారు ట్విట్టర్‌లో మళ్లీ షేర్ చేసిన వీడియో  238k పైగా వ్యూస్, 20k లైక్స్ ను సొంతం చేసుకుంది.

Also Read: Solar Eclipse 2022: సూర్యగ్రహణ ప్రభావం తొలగించుకోవడానికి.. చేయాల్సిన దానాలు, పూజలు ఏమిటంటే..