Viral Video: అయ్యో పాపం.. వ్యాయామం చేయాలనుకుంటే ఇట్టా జరిగిందేంటీ.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..
రోజూ ఉదయాన్నే వ్యాయమం చేయడం చాలా మందికి అలవాటు.. నిత్యం వ్యాయమం చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
రోజూ ఉదయాన్నే వ్యాయమం చేయడం చాలా మందికి అలవాటు.. నిత్యం వ్యాయమం చేయడం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా.. రక్తపోటు నియంత్రిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. గుండె జబ్బులను నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఎందుకంటే స్థూలకాయమే అనేక వ్యాధులకు కారణమవుతుంది. ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది తమ ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజు వ్యాయమం చేయడం.. ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం వలన శరీర బరువును నియంత్రించడమే కాకుండా.. రోజంతా ఉత్సాహంగా ఉంటున్నాయి. అయితే వ్యాయమం చేస్తున్నప్పుడు జరిగే పొరపాట్ల వలన శరీరానికి గాయాలవుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదంగానూ మారొచ్చు.. అందుకే వ్యాయమం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు కూడా అవసరమే. ఇటీవల వ్యాయమాలు.. ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా పడి పడి నవ్వుతారు.. ఇంతకీ అందులో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుందామా..
ఓ వ్యక్తి ఉదయాన్నే రోడ్డు పక్కన ఉండే బల్లల మాదిరి సిమెంట్ దిమ్మెలపై కూర్చొని వ్యాయమం చేస్తుంటాడు.. వ్యాయమం చేస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా వెనక్కి బొక్క బోర్లా పడ్డాడు.. ఆ తర్వాత తనను ఎవరు చూడకూడదని.. వెంటనే లేచి ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లుగా నటిస్తుంటారు. ఈ సన్నివేశాలు మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను IPS అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
शुरुआत चाहे जैसी भी रही हो, फिनिश हमेशा स्टाइल से होनी चाहिए. ? सुप्रभात pic.twitter.com/vmoxzYNiBA
— Dipanshu Kabra (@ipskabra) April 29, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
KGF Chapter 2 Collections: కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదుగా.. మరో రికార్డ్ సృష్టించిన రాకీ భాయ్..
Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా.
Vijay Sethupathi: ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. మరోసారి విలన్గా..