Viral Video: వామ్మో.. దుబాయ్ షేక్‌కు చుక్కలు చూపించిన పిల్ల సింహం.. అసలేమైందంటే..? వీడియో
Lion cub suddenly attacked: క్రూర జంతువులను చూస్తే చాలు.. చాలామంది భయంతో వణికిపోతుంటారు. అలాంటి జంతువులను దూరం నుంచి
Lion cub suddenly attacked: క్రూర జంతువులను చూస్తే చాలు.. చాలామంది భయంతో వణికిపోతుంటారు. అలాంటి జంతువులను దూరం నుంచి చూసినా సరే అక్కడినుంచి దూరంగా వెళతారు. అందుకే జంతు ప్రేమికులు కుక్క, పిల్లి, ఆవు లాంటి సాధు జంతువులను పెంచుకుంటారు. అయితే.. కొంతమంది క్రూర జంతువులను కూడా పెంచుకుంటారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలా భయంకరమైన జంతువులను పెంచుతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అయితే.. దుబాయ్‌లోని షేక్‌లు సింహాలు, చిరుతలు వంటి భయంకరమైన అడవి జంతువులను పెంచడానికి ఇష్టపడుతుంటారు. అయితే కొన్నిసార్లు వారి ఈ అభిరుచి ప్రమాదంలో పడేస్తుందనడానికి ఈ వీడియోనే నిదర్శనం. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. పెంచుకుంటున్న సింహం పిల్ల అకస్మాత్తుగా షేక్‌పై దాడి చేసింది. అయితే.. ఆ షేక్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
అయితే.. దుబాయ్ షేక్‌లు.. భయంకరమైన జంతువులతో కార్లలో ప్రయాణించడం, వాటిని ఒడిలో ఉంచుకుని దిగే ఫొటోలు అనేకం నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు అలాంటి జంతువులు.. వారికి ప్రమాదకరంగా మారతున్నాయని తరచూ వార్తలొస్తుంటాయి. అయినా కానీ వారు భయంకరమైన జంతువులను పెంచేందుకు ఇష్టపడుతుంటారని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ షాకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.. వీడియో..
View this post on Instagram
అయితే.. ఈ వీడియోలో దుబాయ్ షేక్.. సింహం పిల్లతో పార్క్‌లో కూర్చొని ఉంటాడు. ఈ సమయంలో.. షేక్ సింహం తలపై చేతిని ఉంచి నెమురుతుంటాడు. అయితే.. ఈ వీడియో చూస్తే.. సింహం పిల్ల కుక్కలాగా అనిపిస్తుంది. అయితే.. ఆ సింహం పిల్ల ఒక్కసారిగా షేక్‌పై విరుచుకుపడుతుంది. వెంటనే అతని మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలో అక్కడున్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి.. షేక్‌ను సింహం బారి నుంచి తప్పిస్తాడు. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా షేక్‌కు.. సింహం చుక్కలు చూపించిందని.. అలాంటి జంతువులతో జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: