Viral News: ‘నేను నీ పనిమనిషి కాదు.. ఉద్యోగిని’.. విమానంలో ప్రయాణికుడికి- ఎయిర్‌హోస్టెసకి మధ్య డిష్యుం.. డిష్యుం..
విమాన ప్రయాణంలో తగదాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తరచూ ఉండవు. విమానయాన సిబ్బంది ప్రయాణీకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ముఖ్యమైన వ్యక్తులు విమాన ప్రయాణాలు ఎక్కువుగా చేసే అవకాశం ఉండటంతో అక్కడ సిబ్బంది..

విమాన ప్రయాణంలో తగదాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తరచూ ఉండవు. విమానయాన సిబ్బంది ప్రయాణీకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ముఖ్యమైన వ్యక్తులు విమాన ప్రయాణాలు ఎక్కువుగా చేసే అవకాశం ఉండటంతో అక్కడ సిబ్బంది సైతం ప్రయాణీకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కచ్చితంగా ఎయిర్‌పోర్టు అథారిటీ నియమనిబంధనలు పాటిస్తారు. ప్రయాణికులు కూడా చాలా సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించరు. కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోకుండా జరిగే ఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణికుడికి-ఎయిర్‌హోస్టెస్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో డిసెంబరు 16వ తేదీన ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య ఆహారం విషయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ విషయంపై ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, కస్టమర్ సౌలభ్యమే తమ ప్రాధాన్యతగా విమానయాన సంస్థ ప్రకటించింది.




ఎయిర్ హోస్టెస్ సదరు ప్రయాణికుడితో మాట్లాడుతూ.. మీవల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తామని చెప్పగా.. ఈ సమాధానానికి తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు..‘‘నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి’’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఎయిర్‌హోస్టెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘తాను ఉద్యోగిని.. నీకు పనిమనిషిని కాను’’ అని గట్టిగా అరిచింది. దీంతో ‘‘ఎందుకు అరుస్తున్నావు? నోర్మూసుకో..’’ అని ప్రయాణికుడు హెచ్చరించగా, ‘‘నువ్వూ నోర్మూసుకో’’ అని ఎయిర్‌హోస్టెస్ బదులిచ్చింది. ఆమె సహోద్యోగి వారిద్దరిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Tempers soaring even mid-air: “I am not your servant”
An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv
— Tarun Shukla (@shukla_tarun) December 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..