Viral Video:చట్నీతో గోల్గప్పా ఐస్‌క్రీం రోల్స్‌.. కొత్తగా ఉంది కదూ.. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..

ఐస్‌క్రీమ్‌తో మోమోస్, దోస, ధోక్లా చేయడం చూశాం.. కాస్తా వెరైటీగా ఉండటంతో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారింది.  గోల్గప్పా..

Viral Video:చట్నీతో గోల్గప్పా ఐస్‌క్రీం రోల్స్‌.. కొత్తగా ఉంది కదూ.. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..
Golgappa Ice Cream Rolls
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 30, 2022 | 11:56 PM

Golgappa Ice Cream Roll: ఈ మధ్య గోల్గప్పా(Golgappa)పై చాలా ప్రయోగాలు నడుస్తున్నాయి. అందులోనూ పాకశాస్త్ర నిపుణులు ముందువరసలో ఉంటున్నారు. మొన్న ఫైర్ పానీ పూరి రెడీ చేసిన అందిరితో సూపర్ అనిపించుకుంటే.. ఇప్పుడు అందుకు రివర్స్ లో ఓ ప్రయోగం చేసి నెటిజన్లకు షాక్ తినిపిస్తున్నాడు. ఆ విచిత్రమైన వంటకంతో అటు ఐస్‌క్రీమ్ ప్రియులను.. ఇటు గోల్ గప్పను ఇష్టపడేవారిని కలిపి తనవైపు తిప్పేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సెషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌తో మోమోస్, దోస, ధోక్లా చేయడం చూశాం.. కాస్తా వెరైటీగా ఉండటంతో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారింది.  గోల్గప్పా ప్రతి ఒక్కరూ ఆనందించే విషయం.. కానీ ఐస్ క్రీంతో? కాదు అనుకుంటాం. ఫుడ్ బ్లాగింగ్ ఛానెల్, ది గ్రేట్ ఇండియన్ ఫుడీ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నారు, దీనిలో ఒక వ్యక్తి గోల్గప్పతో ఐస్ క్రీం రోల్స్ తయారు చేయడం చూడవచ్చు.

అతను సుఖా పూరీ, ఆలూ, చోలే చాలా చట్నీలతో రెండు గొల్గప్పలను తయారు చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. తదుపరి దశకు వెళుతున్నప్పుడు, ఆ వ్యక్తి కొంచెం క్రీమ్‌ని జోడించి, ఐస్‌క్రీం రోల్స్‌ను తయారు చేయడానికి ముందుకు వచ్చాడు.

క్రింద వైరల్ వీడియో చూడండి:

వీడియోకు 151,000 వ్యూస్ వచ్చాయి..  టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. పానీ పూరీ ఐస్‌క్రీమ్ రుచిగా ఉందని బ్లాగర్ చెప్పగా.. నెటిజన్లు ఐస్‌క్రీమ్‌ను గోల్గప్పస్‌తో కలపడం చూసి అసహ్యించుకున్నారు. పోస్ట్ పై విపరీతంమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..