Viral Video: అయ్యో పాపం.. జాయ్‌రైడ్ పీడకలగా మారింది… అరవై అడుగుల ఎత్తులో అర్ధరాత్రి హాహాకారాలు
కటక్‌లోని బాలి జాతరలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వింగ్ రైడ్ వెహికిల్‌లో సాంకేతికల లోపం తలెత్తింది. దీంతో వెహికిల్ గాలిలో పనిచేయకపోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఒక మహిళ, ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది భూమి నుండి 60 అడుగుల ఎత్తులో...

కటక్‌లోని బాలి జాతరలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వింగ్ రైడ్ వెహికిల్‌లో సాంకేతికల లోపం తలెత్తింది. దీంతో వెహికిల్ గాలిలో పనిచేయకపోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఒక మహిళ, ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది భూమి నుండి 60 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సాంకేతిక లోపం కారణంగా రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది.
దాదాపు రెండు గంటల పాటు గాలిలోనే చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది అత్యవసర పరిస్థితికి వేగంగా స్పందించింది. హైడ్రాలిక్ లిఫ్ట్ ఉపయోగించి గాల్లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా రక్షించారు. ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కటక్ డీసీపీ ఖిలారి రిషికేశ్ సహా సీనియర్ అధికారులు ఆపరేషన్‌ను నిశితంగా పర్యవేక్షించారు. వేలాది మంది ఆందోళనతో చూస్తున్నారు. జాయ్‌రైడ్ పీడకలగా మారింది!
కింద ఉన్న సందర్శకులు ఈ తతంగమంతా వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
#Odisha: Fire service team successfully rescued eight people who were stuck on a swing at a height of 60 feet after it developed a technical snag during Bali Jatra in #Cuttack. pic.twitter.com/UPvtuTrn1b
— Siraj Noorani (@sirajnoorani) November 13, 2025
