Viral Video: రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్దుడి ప్రాణం తీసిందిగా… షాకింగ్ వీడియో వైరల్
వీధిలో రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్ధుడి నిండు ప్రాణం తీశాయి. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టివీ కెమెరాలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. వీడియోలోని ఫుటేజ్ ప్రకారం ఒక వీధిలో రెండు ఎద్దులు హోరా హోరీ పోట్లాడుకుంటున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ కొమ్ములతో...

వీధిలో రెండు ఎద్దుల పొట్లాట ఓ వృద్ధుడి నిండు ప్రాణం తీశాయి. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టివీ కెమెరాలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. వీడియోలోని ఫుటేజ్ ప్రకారం ఒక వీధిలో రెండు ఎద్దులు హోరా హోరీ పోట్లాడుకుంటున్నాయి. ఢీ అంటే ఢీ అంటూ కొమ్ములతో కుమ్ముకుంటున్నాయి. తగ్గేదే లే అంటే ఏ ఒక్కటి కూడా వెనకడుగే వేయడం లేదు. వాటిని తీరును చూసిన స్థానికులు దూరంగా వారించడానికే భయపడిపోయారు. ఈ క్రమంలో ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దుల పోట్లాను విడగొట్టేందకు ప్రయత్నించాడు.
అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు ఫైటింగ్ నుంచి హఠాతుంగా జరిగిపోయింది. ఈ క్రమంలో అనుకోకుండానే వృద్దుడు నిలబడి ఉన్న మెట్లపైకి ఎద్దు దూసుకొచ్చింది. ఈ క్రమంలో వృద్దుడికి ఎద్దు ఢీకొట్టింది. ఈ దాడిలో కిందపడిన ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వృద్ధుడి వద్దకు వచ్చాడు. ఎద్దును అక్కడి నుంచి తరిమేశాడు. అయితే ఎద్దు దాడి వల్ల తీవ్ర బాధతో అల్లాడిన ఆ వృద్ధుడు అక్కడే ప్రాణాలు వదిలాడు.
మే 31న రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రాణం ఎప్పుడు ఏ రకంగా పోతుందో ఎవరికి తెలియదంటూ వేదాంత ధోరణిలో కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
कोटा में सांडों की लड़ाई बना जानलेवा हादसा!#kota में दो सांडों की भयंकर भिड़ंत के दौरान एक बुजुर्ग की दुखद मौत हो गई।
हादसा उस वक्त हुआ जब एक सांड ने पास खड़े बुजुर्ग पर अचानक हमला कर दिया।
📹 वीडियो सोशल मीडिया पर तेजी से हो रहा वायरल… #Rajasthan #viral #trendingvideo pic.twitter.com/Mqwna6ERIB
— Vishwesh Tiwari (@VishweshTi92858) June 4, 2025