Viral Video: గుండెల్లో గట్స్ ఉండాలి బాస్.. సైజ్‌లో ఏముంది… భారీ ఏనుగును పరిగెత్తించిన బక్క గుర్రం.. వీడియో వైరల్
కొట్లాటకైనా, స్నేహానికైనా సమ ఉజ్జీలు ఉండాలంటారు. మనుషులకైతే ఈ సూత్రం సరిపోతుంది గానీ, జంతువులకు అదంతా ఏ తెల్వదు.. తేడా వస్తే ఏసేసుడే ఉంటుంది. అయితే గుండెలో ధైర్యం ఉండాలే కానీ, పర్సనాలిటీ సబంధం లేదని ఓ గుర్రం నిరూపించింది. సాధారణంగా రెండు జంతువులు ఎదురెదురు పడితేనే కొట్లాటకు రెడీ అన్నట్లు...

కొట్లాటకైనా, స్నేహానికైనా సమ ఉజ్జీలు ఉండాలంటారు. మనుషులకైతే ఈ సూత్రం సరిపోతుంది గానీ, జంతువులకు అదంతా ఏ తెల్వదు.. తేడా వస్తే ఏసేసుడే ఉంటుంది. అయితే గుండెలో ధైర్యం ఉండాలే కానీ, పర్సనాలిటీ సబంధం లేదని ఓ గుర్రం నిరూపించింది. సాధారణంగా రెండు జంతువులు ఎదురెదురు పడితేనే కొట్లాటకు రెడీ అన్నట్లు ప్రవర్తిస్తుంటాయి. నా అడ్డాలో నీ పాగా ఏమిటంటూ కొత్త జంతువు వెళ్లే దాకా వెంబడిస్తుంటాయి. అలాంటి సంఘటనే ఇక్కడో చోట జరిగింది. అది కూడా గుర్రం, ఏనుగు మధ్య ఫైట్ జరిగింది. భారీ ఆకారంలో ఏనుగును దానిలో సగం కూడా లేని గుర్రం పరుగులు పెట్టించడమే అసలైన ట్విస్ట్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలోని దృశ్యాల ప్రకారం ఏనుగుపైకి ఓ గుర్రం దూకుడుగా దాడి చేసింది. అయితే బెదిరిపోయిన ఏనుగు ఏమాత్రం ప్రతిఘటించలేదు. పైగా అక్కడి నుంచి పారిపోయింది ఏనుగు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పాల్సోడా ఫాటా సమీపంలో పెద్ద ఏనుగు అంబారిపూ ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అక్కడికి సమీపంలోనే ఓ తెల్ల ఏనుగును అప్పటికే కట్టి ఉంచారు. అయితే అక్కడికి వచ్చిన ఏనుగును చూసిన గుర్రం తాడును తెంపుకుని మరీ ఏనుగుపై ఉరికింది. ఈ క్రమంలో ఏనుగుపై కూర్చున్న వ్యక్తి కర్రతో గుర్రాన్ని తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉన్న ఏనుగు, దానిలో సగం కూడా లేని గుర్రం దాడిని ఎదుర్కోలేక పారిపోయింది.
అయితే ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి స్థానికులు గుర్రాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ గుర్రం ఏమాత్రం బెదరకుండా దూకుడుగా ఏనుగును పరిగెత్తించింది. ఒకరు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్స్ షాక్ అవుతూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో చూడండి:
हाथी और घोड़े का युद्ध भी देख लो 😄 pic.twitter.com/Amwbl5TkP5
— CRICKET LOVER 🙃 (@Cricket_lover2o) May 31, 2025