AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేటాడాలనుకుంది.. కానీ పరుగులు తీసింది.. కుక్కకు చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో..

Cat - Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని

Viral Video: వేటాడాలనుకుంది.. కానీ పరుగులు తీసింది.. కుక్కకు చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో..
Cat Dog Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Oct 18, 2021 | 6:57 PM

Share

Cat – Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మరికొన్ని భయంతోపాటు వినోదాన్ని పంచుతాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. జంతువుల వీడియోలు నెటిజన్లను ఫిదా చేస్తుంటాయి. వాటిలో తాజాగా ఓ పిల్లి.. కుక్కనే వెంటాడింది. అదేంటి అనుకుంటున్నారా.. అవును.. కుక్క పిల్లిని వేటాడేందుకు పరుగున వెళ్లింది.. కానీ పిల్లి తిరగబడేసరికి కుక్కే.. వణుక్కుంటూ పరుగులు తీసింది. తాజాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. పిల్లి ధైర్యానికి ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

కుక్క, పిల్లి తారసపడితే.. పిల్లి దొరకకుండా పారిపోతుంది. ఒకవేళ పోరాటం తప్పనిసరి అయితే.. ఎప్పుడూ పిల్లిపై కుక్కే గెలుస్తుంది.. కానీ ఇక్కడ రివర్స్ అయింది.. పిల్లి అప్రమత్తతతో ప్రాణం దక్కిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. పిల్లి కుక్కపై దాడిచేయడం ఎంటంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. వైరల్ అవుతున్న వీడియోలో.. పెంపుడు కుక్క ఇంటి లోపల నుంచి పిల్లిని చూసి.. గట్టిగా అరుస్తుంది. అయితే కుక్క లోపల ఉంది కదా.. పిల్లికి ఏం కాదు అనుకుంటాం.. కానీ ఒక్కసారిగా తలుపు తెరుచుకోగానే కుక్క.. పిల్లిని వేటాడేందుకు పరుగులు తీస్తుతంది.. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉన్న పిల్లి.. వెంటనే ప్రతిఘటిస్తుంది. పిల్లి కోపాన్ని చూసి భయపడిన కుక్క.. అక్కడినుంచి ఇంట్లోకి పరుగులు తీస్తుంది. వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by Tag._.mee (@tag._.mee)

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ మీ అనే అకౌంట్ షేర్ చేయగా.. ఇది నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటూ తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేయడమే కాకుండా.. దీనిపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Viral Video: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఇల్లు.. షాకింగ్ వీడియో వైరల్..

Road Accident: హైవేపై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న ఆరు వాహనాలు.. ముగ్గురు దుర్మరణం..