AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మేం ముగ్గురం.. నువ్వు ఒక్కదానివే.. రా చూసుకుందాం.. వీడియో చూస్తే నవ్వాపులోకేరు..

సోషల్‌ మీడియాలో తరచూ అనేక వీడియో వైరల్‌ అవుతూ ఉంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందులో కొన్ని జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్ని భాయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా ఇలాంటి ఒక వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేంటో చూసేద్దాం పదండి.

Watch: మేం ముగ్గురం.. నువ్వు ఒక్కదానివే.. రా చూసుకుందాం.. వీడియో చూస్తే నవ్వాపులోకేరు..
Vural Video
Anand T
|

Updated on: Nov 28, 2025 | 12:15 PM

Share

మనం ఇళ్లలో చాలా రకాల పెంపుడు జంతువులను పెంచుకుంటాం. అందులో కుక్కలు, పిల్లులు వంటివి ఉంటాయి. అయితే అవి చేసి కొన్ని తింగరి పనులు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే ఈ పెంపుడు జంతవులే ఆ ఇంటికి రక్షణగా కూడా నిలుస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. వైరల్‌ వీడియో ప్రకారం.. ఒక ఇంటి గుమ్మంలో మూడు పిల్లులు కూర్చొని ఉన్నాయి.. అదే సమయంలో అక్కడి ఒక కోబ్రా వచ్చింది.

ఆ పామును చూసిన మూడు పిల్లులు ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాయి. ఆ పాము కూడా గేటు దగ్గర ఉన్న పిల్లుల చూసి అక్కడే ఆగిపోయింది. తర్వాత పడగ విప్పిం వాటిని చూస్తు నిలుచుండి పోయింది. అప్పేడే ఇంట్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ పిల్లులు నిల్చొని ఉండడం చూసి.. కాస్తా దగ్గరకు వచ్చాడు. పిల్లుల మందు ఉన్న సామును చూసి కంగుతిన్నాడు. వెంటనే భయంతో ఇంట్లోకి పరుగులు తీశాడు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by @randomstooffss

అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈవీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిల్లులు పామును సవాల్ చేస్తున్నాయి.. రా నువ్వా మేమా అనేలా చూస్తున్నాయని ఒకరు కామెంట్ చేయగా.. ఇప్పుడొక మీని యుద్ధమే జరగేటట్టుందని మరో యూజర్ రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.