Viral Video: వడదెబ్బకు రోడ్డుమీద పడిన వ్యక్తి.. మానవత్వం చూపిన వాహనదారులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

|

Apr 23, 2022 | 12:49 PM

Viral Video: అసలే ఎండాకాలం (Summer Season). బానుడు భగభగమంటున్నాడు. దాంతో కొందరు వడదెబ్బకు(Sun Stroke) గురవుతున్నారు. ఓ వ్యక్తి నడిరోడ్డుమీద సృహ లేకుండా పడి ఉన్నాడు..

Viral Video: వడదెబ్బకు రోడ్డుమీద పడిన వ్యక్తి.. మానవత్వం చూపిన వాహనదారులు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral Video
Follow us on

Viral Video: అసలే ఎండాకాలం (Summer Season). బానుడు భగభగమంటున్నాడు. దాంతో కొందరు వడదెబ్బకు(Sun Stroke) గురవుతున్నారు. ఓ వ్యక్తి నడిరోడ్డుమీద సృహ లేకుండా పడి ఉన్నాడు. ఈ ఘటన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది పక్కనుంచి వెళ్లిపోయారు. కానీ కొందరు అలా కాదు. కళ్లెదుట ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించకుండా ఉండలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కొందరు ఆగిపోయారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పడిపోయిన వ్యక్తిని పైకి లేపారు. అతడికి సపర్యలు చేసి అతనికి మెలకువ వచ్చే వరకు అక్కడే వున్నారు. మంచినీళ్ళు తాగించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు అతనికి కావలసిన డబ్బులు కూడా ఇచ్చారు .

హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు. సైబర్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేశారు. మనం ఒకరి కోసం ఒకరు చేసేది సాయం గొప్ప మేలు చేస్తుంది అంటూ ఒక కామెంట్ జత చేశారు. .  వాహనదారులు చూపించిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎండాకాలంలో ఇలాంటివి జరిగితే వెంటనే స్పందించండి. అలాంటివారిలో మన ఆత్మీయులు కూడా వుండవచ్చు. రోడ్డుమీద వెళుతున్నవారు కాపాడకపోతే కొంతమంది ప్రాణాలు పోవచ్చు. గోల్డెన్ అవర్ అని ఒకటుంటుంది. ఆ గోల్డెన్ అవర్ లో సాయం చేస్తే వడదెబ్బ తగిలినవారు కోలుకుంటారు. గుండెనొప్పి వచ్చిన వారు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Number Plate: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. ఆ ఒక్క నెంబర్ కోసం రూ. 70 కోట్లు పెట్టాడు..

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి

Pawan Kalyan: పవన్ పశ్చిమ టూర్‌‌లో జై జగన్ అంటూ నినాదాలు.. నోరు జారి నాలుక కరుచుకున్న ఫ్యాన్స్