AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే దూల తీరిందిగా..

Biker Distracted by Girls: వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోంది. క్షణ కాలం పాటు మనసు అటుఇటు అయినా ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ యువకుడు పెట్రోల్ బంకులో కాబట్టి సరిపోయింది, అదే రద్దీగా ఉండే రహదారిపై ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఫలితం చాలా ఘోరంగా ఉండేదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Viral Video: అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే దూల తీరిందిగా..
Biker Viral Video
Venkata Chari
|

Updated on: Jun 09, 2026 | 11:16 AM

Share

Viral Video Petrol Pump: సామాజిక మాధ్యమాలలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఒక యువకుడు పెట్రోల్ పంపు వద్ద నిల్చున్న ఇద్దరు అమ్మాయిలను చూస్తూ పూర్తిగా పరధ్యానంలో పడిపోయి చేసిన విన్యాసం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఎచ్చులకు పోతే ఆ తర్వాత ఎలా పరిస్థితి ఎదురవుతుందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది.

క్షణ కాలం పాటు పక్కకు తిరిగిన చూపు..

ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక యువకుడు తన మోటార్ సైకిల్‌పై పెట్రోల్ వేయించుకోవడానికి బంకులోకి వచ్చాడు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలతోపాటు ఓ పిల్లాడు ఆ బంకు పక్కన నిల్చుని ఉన్నారు. వాళ్లకు సంబంధించిన వ్యక్తి బంకులో పెట్రోలో కొట్టించుకుంటుంటాడు. ఈ క్రమంలో అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకుల చూపు పెట్రోల్ కొట్టించుకోవాల్సిన మెషిన్ వైపు కాకుండా ఆ యువతులవైపు మళ్లింది. వారిని చూస్తూ పూర్తిగా లోకాన్ని మరిచిపోయిన ఆ బైకర్, బైక్ యాక్సిలరేటర్‌ను ఒక్కసారిగా గట్టిగా తిప్పేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో

పెట్రోల్ పంపింగ్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన బైక్..

చూపు ఒకచోట, డ్రైవింగ్ మరోచోట ఉంటే ఇంకేమవుతుంది? ఊహించని విధంగా ఆ మోటార్ సైకిల్ పెట్రోల్ పోసే ప్రధాన ప్లాట్‌ఫామ్ పైకి అడ్డంగా దూసుకెళ్లిపోయింది. దీంతో అదే సమయంలో ఆ మహిళలకు సంబంధించిన వ్యక్తిపైకి పైకి దూసుకెళ్లింది. దీంతో ఇంకేముంది, దెబ్బలు గట్టిగానే తిన్నాడు. కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ సీసీటీవీ క్లిప్‌లో ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైక్ ముందు చక్రం కాస్తా పైకి లేచి, ఆ వేగానికి యువకుడు వాహనాన్ని నియంత్రించలేక తీవ్రంగా తడబడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ పెట్రోల్ కొడుతున్న సిబ్బందితో పాటు మిగతా వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Video: క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రనౌట్స్ భయ్యా.. సోషల్ మీడియాను ఊపేస్తోన్న క్రేజీ వీడియో..!

సామాజిక మాధ్యమాల్లో నవ్వుల పువ్వులు..

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమ వేదికలపై విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల హాస్యభరితమైన కామెంట్లు పెడుతున్నారు. “అమ్మాయిలను చూసిన ఆనందంలో తమ్ముడికి జోష్ ఎక్కువైంది, అందుకే నేరుగా బంకు పైకే ఎక్కించేశాడు” అంటూ కొందరు ఆటపట్టిస్తుంటే, “ఇలాంటి డ్రైవర్ల వల్లే రోడ్లపై అమాయకులు బలవుతున్నారు, డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త శ్రద్ధ పెట్టండి బాస్” అంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: Video: బురద నీటిలో మహిళ చేతికి తగిలిన భారీ ఆకారం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోంది. క్షణ కాలం పాటు మనసు అటుఇటు అయినా ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ యువకుడు పెట్రోల్ బంకులో కాబట్టి సరిపోయింది, అదే రద్దీగా ఉండే రహదారిపై ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఫలితం చాలా ఘోరంగా ఉండేదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ‘రైడర్’ చేసిన విన్యాసం మాత్రం ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
ఒంటరిగా ప్రయాణించాలా?సోలో ట్రావెలింగ్ కోసం టాప్ 5 బెస్ట్ ప్లేసెస్
ఒంటరిగా ప్రయాణించాలా?సోలో ట్రావెలింగ్ కోసం టాప్ 5 బెస్ట్ ప్లేసెస్
పాత రోజుల్లో చేసే పొలం పాయసం.. చుట్టాలకు ఇది పెడితే..
పాత రోజుల్లో చేసే పొలం పాయసం.. చుట్టాలకు ఇది పెడితే..
జబర్దస్త్‌కు దూరమైన నెమలిరాజు ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?
జబర్దస్త్‌కు దూరమైన నెమలిరాజు ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు?
ఆ స్టార్ హీరోయిన్ నా మీద అరిచింది..
ఆ స్టార్ హీరోయిన్ నా మీద అరిచింది..
ఆధార్ కార్డులోని ఫొటోను సింపుల్‌గా మార్చుకోండిలా..
ఆధార్ కార్డులోని ఫొటోను సింపుల్‌గా మార్చుకోండిలా..
ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన భారత్.. తొలి టీమ్‌గా..
ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన భారత్.. తొలి టీమ్‌గా..
పుస్తకాల పురుగు తెలుసు.. కానీ ఇదేంది సామీ.. ఈ వీడియో చూస్తే..
పుస్తకాల పురుగు తెలుసు.. కానీ ఇదేంది సామీ.. ఈ వీడియో చూస్తే..
ఆ ఒక్క సీనే సినిమాను మార్చేసింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్..
ఆ ఒక్క సీనే సినిమాను మార్చేసింది.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్..
ప్రపంచం నాశనమైనా మిగిలేది బొద్దింకలే?శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ
ప్రపంచం నాశనమైనా మిగిలేది బొద్దింకలే?శాస్త్రవేత్తల ఆసక్తికర వివరణ