లోకేషన్ బాగుందని ఫోటోకు ఫోజులిచ్చింది.. అంతలోనే దూసుకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏమైందంటే
కాంక్రీట్ రోడ్డు దగ్గరగా ఉన్న పొదల్లోంచి బయటకు వచ్చిన అతిథి ఎనిమిది అడుగుల పొడవున్న ప్రమాదకరమైన నాగుపాము. అది ఏకంగా యెషి డెమా కాళ్ళ మధ్యలోంచి పాకుతూ వెళ్ళిపోయింది.. దగ్గరలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి కెమెరామెన్‌కి పాము చిక్కింది. అతను వెంటనే భయంతో వీడియో తీయడం మానేశాడు. కాబట్టి వీడియోలో

కొంతమంది అనుకోని అతిథులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఇది కూడా ..ఒక యువతి ప్రకృతి అభయారణ్యంలోకి వెళ్ళే దారిలో ఫోటో తీయించుకోవడానికి ఒక చోట నిలబడి ఉండగా, అకస్మాత్తుగా ఆమె కాళ్ళ మధ్య నుండి ఒక భారీ సర్పం దూసుకొచ్చింది. కానీ, ఆమె అదేం తెలియదు. ఈ సంఘటన యేషి డెమా అనే అమ్మాయికి జరిగింది. పార్కులో షికారు కోసం వెళ్లిన ఆమె యేషి డెమా ఒక అందమైన లోకెషన్ చూసి ఆగిపోతుంది.. అక్కడ తను ఫోటో తీసుకునేందుకు నిల్చుంది. అప్పుడు ఆమెతో ఉన్న ఒక వ్యక్తి తనను వీడియో తీయడం ప్రారంభించాడు. కానీ వారికి చెప్పకుండానే మరొక అనుకోని అతిథి.. ఫ్రేమ్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఏం జరిగిందో మాత్ర ఆ యువతికి తెలియదు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
కాంక్రీట్ రోడ్డు దగ్గరగా ఉన్న పొదల్లోంచి బయటకు వచ్చిన అతిథి ఎనిమిది అడుగుల పొడవున్న ప్రమాదకరమైన నాగుపాము. అది ఏకంగా యెషి డెమా కాళ్ళ మధ్యలోంచి పాకుతూ వెళ్ళిపోయింది.. దగ్గరలో నిలబడి ఉన్న మరొక వ్యక్తి కెమెరామెన్‌కి పాము చిక్కింది. అతను వెంటనే భయంతో వీడియో తీయడం మానేశాడు. కాబట్టి వీడియోలో తరువాత ఏం జరిగిందో తెలియలేదు. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఆ పాము ఆ అమ్మాయికి ఎలాంటి హాని చేయలేదు. ఆ అమ్మాయి తరువాత స్పందిస్తూ, తాను పాముపై కాలు వేయకుండా తప్పించుకున్నానని, అది తన ప్రాణాలను కాపాడిందని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..