AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: క్లాస్‌లో స్టూడెంట్ త్రేన్చడంతో టీచర్‌కు కోపం.. వింత శిక్ష.. విద్యార్థిని తల్లి ఆగ్రహం

కునుకు పాట్లు పడడం, లేదా పగలబడి నడవం, హఠాత్తుగా ఉల్కిపడడం, త్రేన్పులు వలన ఎవరికైనా సమస్యగా మారుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే స్కూల్లో ఒక అమ్మాయికి అలాంటిదే జరిగింది. క్లాస్‌రూమ్‌లో ఓ స్టూడెంట్ ఎక్కువ సౌండ్ తో త్రేన్చడంతో.. ఆమె టీచర్ ఓ వింతమైన శిక్ష విధించింది. తన కూతురికి శిక్ష విధించిన విషయం తెలిసి ఆమె తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

Viral News: క్లాస్‌లో స్టూడెంట్ త్రేన్చడంతో టీచర్‌కు కోపం.. వింత శిక్ష.. విద్యార్థిని తల్లి ఆగ్రహం
Pe Lesson
Surya Kala
|

Updated on: Dec 10, 2023 | 10:00 AM

Share

కొన్ని శారీరక కార్యకలాపాలు సాధారణమైనవి..  ఒకొక్కసారి అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా జరుగుతాయి. త్రేనుపు, ఆవలింత, నిద్ర, ఉల్కిపడడం వంటి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటిదే పాఠశాలల్లో చిన్న పిల్లలు కునుకు తీయడం. ఇలాంటి సంఘటనలు తరచుగా ఎక్కడోచోట తరచుగా జరుగుతూనే ఉంటాయి. తరచుగా ఆఫీసుల్లో వ్యక్తులకు కూడా జరుగుతుంది. సర్వసాధారణంగా నిద్ర పోవడానికి సమయం, స్థలం వంటి వాటితో పని ఉండదు. నిద్ర ఎప్పుడైనా, ఎక్కడైనా  వస్తుంది. అయితే ఇలా కునుకు పాట్లు పడడం, లేదా పగలబడి నడవం, హఠాత్తుగా ఉల్కిపడడం, త్రేన్పులు వలన ఎవరికైనా సమస్యగా మారుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే స్కూల్లో ఒక అమ్మాయికి అలాంటిదే జరిగింది. క్లాస్‌రూమ్‌లో ఓ స్టూడెంట్ ఎక్కువ సౌండ్ తో త్రేన్చడంతో.. ఆమె టీచర్ ఓ వింత శిక్ష విధించింది. తన కూతురికి శిక్ష విధించిన విషయం తెలిసి ఆమె తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

బాలిక ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్‌లో ఉంది. స్టూడెంట్ నెట్‌బాల్ ఆడుతున్న సమయంలో పెద్ద సౌండ్ వచ్చేలా త్రేన్చింది. దీంతో టీచర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడు ఏంటి అంటూ చిన్నారి బాలికను అడిగింది.. అంతేకాదు ఆ స్కూల్ టీచర్ కు కోపం వచ్చి నీ బిహేవార్ బాగోలేదు అంటూ క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపించింది. అంతేకాదు శిక్షని కూడా విధించింది. చిన్నారి స్టూడెంట్ స్కూల్ టైమింగ్ అయిన తర్వాత 20 నిమిషాల పాటు నిర్బంధంలో ఉంచారు కూడా.

మిర్రర్ నివేదిక ప్రకారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తన తల్లికి టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ గురించి చెప్పింది. అప్పుడు ఆ తల్లి తన కుమార్తెకు జరిగిన ఈ వింత సంఘటన మొత్తం కథను మమ్స్‌నెట్ అనే వెబ్‌సైట్‌లో వివరించి ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టూడెంట్ కు ఇంత ‘కఠినమైన శిక్ష’ ఇచ్చిన ఉపాధ్యాయుడిని ‘మూర్ఖుడు’ అని, ఆ సంఘటనను ‘హాస్యాస్పదంగా’ అభివర్ణించాడు ఓ డాక్టర్.

ఇవి కూడా చదవండి

ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు

అదే సమయంలో ఈ వింత సంఘటన గురించి తెలిసి ‘మమ్స్‌నెట్’ వినియోగదారులు కూడా కోపాన్ని వ్యక్తం చేశారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. నివేదికల ప్రకారం విద్యార్థికి ఇచ్చిన ‘శిక్ష’తో చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు. అయితే కొంత మంది వినియోగదారులు ఖచ్చితంగా మొత్తం కథను తెలుసుకోవడానికి..  విషయాన్ని అర్థం చేసుకోవడానికి తల్లి ఉపాధ్యాయుడితో మాట్లాడాలని సూచించారు.

వినియోగదారులు ఏమి చెబుతున్నారంటే

ఒకరు వ్రాశారు, ‘ఆవలింత  అయితే ఏదోక్లా అణిచిపెట్టుకునేది.. త్రేన్పులు కనుక బాలిక అణచివేయలేక పోయింది అని నేను పర్వాలేదు అనుకుంటున్నాను అయినా పాఠశాల తర్వాత 20 నిమిషాలు అంతగా  ఎక్కువ సమయం కాదని వ్యాఖ్యానిస్తే, మరొకరు ‘బిగ్గరగా బర్పింగ్ చేయడం అసహ్యం, అగౌరవంగా ఉంటుంది అని కామెంట్ చేశారు. ‘చాలా మంది దీనిని నియంత్రించగలరని వ్యాఖ్యానించారు,

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..