Viral News: రూ.10 నాణేలతో రూ.6 లక్షల విలువైన కారును కొనుగోలు చేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్

ఓ వ్యక్తి.. రూ. 10 నాణేల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. రూ.10 నాణేలను ప్రజలు స్వీకరించకపోవడంతో విసుగు చెందిన ఓ వ్యక్తి కేవలం నాణేలతో కారు కొనాలని నిర్ణయించుకున్నాడు.

Viral News: రూ.10 నాణేలతో రూ.6 లక్షల విలువైన కారును కొనుగోలు చేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్
Rs 10 Coins
Follow us
Surya Kala

|

Updated on: Jun 19, 2022 | 6:49 PM

Viral News: గత రెండు మూడు సంవత్సరాల నుంచి రూ.5, రూ. 10 నాణేలను కస్టమర్స్ నుంచి తీసుకోవడానికి వ్యాపారస్తులు అభ్యంతరం చెబుతున్నారు.. అదే సమయంలో వ్యాపారస్తుల నుంచి చిల్లరగా.. ఈ నాణేలను ఇస్తుంటే.. తీసుకోవడానికి వినియోగదారులు సంకోచిస్తున్నారు. తమకు వద్దు అంటూ అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఓ వ్యక్తి..  రూ. 10 నాణేల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. రూ.10 నాణేలను ప్రజలు స్వీకరించకపోవడంతో విసుగు చెందిన ఓ వ్యక్తి కేవలం నాణేలతో కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత కొన్ని నెలలగా  రూ. 10 నాణేలను సేకరించి ఇప్పుడు వాటితో ఏకంగా కారుని కొనుగోలు చేశాడు.. వివరాల్లోకి వెళ్తే.. తమినాడు ధర్మపురి అరూర్‌కు చెందిన వెట్రివేల్ కారు కొనుగోలు కోసం దాదాపు నెల రోజుల పాటు రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాడు. నాణేలను తీసుకుని కారు ఇవ్వడానికి మొదట డీలర్ షిప్ తొలుత సంకోచించినా..  వెట్రివేల్ దృఢ నిశ్చయాన్నీ చూసి డీల్ కు అంగీకరించారు.

ధర్మపురిలోని ప్రముఖ వాహన డీలర్‌ షాప్ కు వెట్రివేల్ కారు కొనుక్కోవడానికి వాహనం నిండా రూ.10 నాణేలతో షోరూమ్‌కి రావడంతో అక్కడి ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. అరూర్‌కు చెందిన వెట్రివేల్.. తన తల్లి దుకాణం నడుపుతుంటుందని.. అయితే కస్టమర్లు రూ. 10 నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. అంతేకాదు అనేక సందర్భాల్లో తన ఇంటి వద్ద పెద్ద మొత్తంలో నాణేలు ఉన్నాయని చెప్పాడు.

Rs 10 Coins 2

Rs 10 Coins 2

పిల్లలు కూడా రూ. 10 రూపాయల నాణేలు విలువ లేనివిగా భావించి వాటితో ఆడుకోవడం చూసినట్లు చెప్పాడు. అందుకే కేవలం రూ.10 నాణేలతో కారు కొనుక్కోవడం ద్వారా అందరికీ ఈ నాణేల పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. వెట్రివేల్ కారు కొనుగోలు కోసం దాదాపు నెల రోజుల పాటు రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాడు. డీలర్‌షిప్ మొదట సంకోచించినప్పటికీ, వెట్రివేల్ దృఢ నిశ్చయంతో..  వారు ఒప్పందానికి అంగీకరించారు.

Rs 10 Coins 1

Rs 10 Coins 1

బ్యాంక్ సిబ్బంది సైతం.. రూ . 10 నాణేలు తీసుకునేందనుకు సిద్ధంగా లేరని  ప్రజలు వాపోతున్నారు. అసలు ఈ నాణేలు విలువ లేనివని ఆర్‌బీఐ చెప్పనప్పుడు..  బ్యాంకులు వాటిని ఎందుకు స్వీకరించడం లేదు? ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వెట్రివేల్ చెప్పారు.

Rs 10 Coins 4

Rs 10 Coins 4

తన బంధువులతో కలిసి వెట్రివేల్ రూ.10 నాణేల బస్తాలను వాహన డీలర్‌ షాప్ కు తీసుకెళ్లగా, వాటన్నింటిని లెక్కించి, చివరకు వాహన తాళాలను అతనికి అందజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..